సెక్స్‌వర్కర్లపై తాలిబన్ల కన్ను.. గ్యాంగ్‌రేప్స్..ఆపై మర్డర్స్ ?
ప్రత్యేకించి వ్యభిచారం తాలిబన్ల దృష్టిలో మహా నేరం. అందుకు హత్య చేయడమే వారి దృష్టిలో అసలైన శిక్ష. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ నియమాలు అమలు చేసే పనిలోపడ్డారు. మహిళలపై దాష్టీకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అఫ్గానిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్ ను తాలిబన్లు రద్దు చేశారు. అంతే కాదు.. అనేకమంది మహిళలను ఉద్యోగాలు మాన్పించారు. ఇక ఇప్పుడు తాలిబన్లు సెక్స్ వర్కర్లపై దృష్టి సారించారు.
అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోనే వందల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారిని జల్లెడపట్టే పని ప్రారంభించారు తాలిబన్లు. మరి వారిని గుర్తించడం ఎలా.. అందుకే తాలిబన్లు టెక్నాలజీని వాడుతున్నారు. ప్రత్యేకించి అశ్లీల వెబ్‌సైట్ల ద్వారా సెక్స్ వర్కర్లను గుర్తించే పని ప్రారంభించారు. టెక్నాలజీ పెరిగాక వ్యబిచారం కూడా ఇంటర్‌నెట్‌కు ఎక్కింది. అనేక వెబ్ సైట్లు వ్యభిచార సేవలు అందిస్తున్నాయి. వ్యభిచారిణుల ఫోటోలు, కాంటాక్ట్ నెంబర్లు వెబ్ సైట్లలో పెడుతున్నాయి.
ఇప్పుడు తాలిబన్లు వీటిని జల్లెడ పడుతున్నారు. వాటి ద్వారా వ్యభిచారిణులను గుర్తించి వారిని సామూహికంగా అత్యాచారం చేసి.. ఆ పై హత్య చేయాలన్నది తాలిబన్ల ఆలోచనగా చెబుతున్నారు. దీంతో కాబూల్ నగరంలోని వ్యభిచారిణులు హడలిపోతున్నారట. ఈవిషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా దృష్టి సారించాయి. ఇలాంటి అరాచకాలు జరగకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏదేమైనా ఇకపై వ్యభిచారం చేయొద్దంటే అదో పద్దతి కానీ.. గతంలో చేసిన వాళ్లను గుర్తించి గ్యాంగ్ రేప్ చేసి.. చంపేయాలనుకోవడం ఏంటో.. ఈ తాలిబన్ల అరాచకం.