కిశోరు - హుషారు : అంతా మంచికే(నా) !
రెండు పార్టీలు తెలంగాణ కేంద్రంగా రాజకీయం నడుపుతున్నాయి. ఈ రెండు పార్టీలకూ ఒక్కరే వ్యూహకర్త కావడంలోనే కథ అం తా నడుస్తుంది. కొన్ని చోట్ల ఆయన చెప్పిన విధంగా గెలిచారని అందుకే ఆయన మాటే మాకు వేదం అని చెబుతున్నారు షర్మిల. ఇప్పటికే అన్నకు ఓ దారి ఇచ్చిన ప్రశాంత్ తనకు కూడా అదే విధంగా రాజకీయంలో ఓనమాలు దిద్దించగలడని నమ్ముతున్నా రు షర్మిల. ఇదంతా మంచికేనా! ఆయన చెప్పేవన్నీ రాజకీయ పార్టీలకు పనికి వస్తాయా? ఆమె లానే సోనియా కాంగ్రెస్ కూడా ప్ర శాంత్ నే నమ్ముతోంది. ఒకేసారి రెండు పార్టీలకు వ్యూహాలు చెప్పే సమర్థత ఆయనలో ఉందా? ఉంటే ఎవరి గెలుపును ఎవరు నిర్ణ యిస్తారు?
నిజంగానే అతడు నిప్పా?
సోనియా కన్నా ప్రశాంత్ సీనియర్ కాదు. చాలా చిన్నోడు. పెద్దగా రాజకీయం తెలిసిన వాడిలా బిల్డప్పయితే ఉంటుంది. ఆ కోటు కారణంగా ఆ విధం అయిన గుర్తింపు పొంది ఉంటాడు. టీ కాంగ్రెస్ కూ షర్మిలకూ ఒకేసారి ఎలా వ్యూహాలు ఇస్తాడు? ఇదే డౌటు.అందరిలోనూ! అంటే షర్మిలను ఓడించమని కాంగ్రెస్ కు.. కాంగ్రెస్ ను ఓడించమని షర్మిలకు చెప్పి పోతాడా ఏమి! ఒకేసారి రెండు పార్టీలూ ఒకే లీడర్ ను ఎలా నమ్ముతున్నాయో ! ఈ రెండు పార్టీలే కాదు జగన్ కూడా ఆయనపైనే నమ్మకాలు ఉంచుతున్నాడ ని, మళ్లీ సీన్ లోకి ఆయననే తెస్తాడని టాక్. అంటే వీళ్లందరికీ కేవీపీ గుర్తుకు రావడం లేదా? ఆ రోజు వైఎస్సార్ కు ఉండే వ్యూహాల ను పదును పెట్టింది ఎవరు ? ఏదేమైనప్పటికీ ఆయనను నిప్పు అన్నాడు కేవీపీ.. ప్రశాంత్ కిశోర్ అనే నిప్పు ఉందీ అని ఒప్పుకు న్నాడు..కేవీపీ..నిజంగానే అతడు నిప్పా? నిప్పో బ్యాటరీనా?
?ఏమయింది టెన్ జన్ పథ్ రాజకీయం?
చాలా దూరంలో ఎన్నికలు ఉన్నా సీన్ లోకి ప్రశాంత్ కిశోర్ వచ్చేశాడు. అదే మ్యాజిక్కు. ఆయనేం చెప్తాడో అటుంచితే ఆయనేం చే స్తాడో అన్నది అటుంచితే ఈ పాటి ఆలోచనలు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు రాకపోవడం ఆశ్చర్యం. అంటే కాంగ్రెస్ లో చదువు కున్న వారంతా అస్సలు బుర్రలకు పని చెప్పడం లేదా? కపిల్ సిబల్ , మన్మోహన్ , చిదంబరం లాంటి వారంతా ఏమయిపోయా రు. వారికి అస్సలు ప్రజల గురించి ఏం తెలియదంటారా? లేకా ప్రశాంత్ కిశోర్ ను ఏమయినా విన్నింగ్ ఫ్యాక్టర్ అనుకుంటున్నా రా? దేశాన్ని నడిపించే శక్తులు ఆలోచించాల్సింది ముందుగా తమని తాము నమ్ముకోవడం. ఆ దిశగా అడుగులు వేయడం మొద లు పెడితే ఏమయినా సాధ్యమే! వ్యూహాలు ఒకరి చెబితే వస్తాయా.. అలాంటప్పుడు కోర్ కమిటీలు ఎందుకు? అంతర్గత సమావే శాలు ఎందుకు? ఏమయింది ఆ రోజు టెన్ జన్ పథ్ రాజకీయం. అంటే సోనియాను మించిన వాడా ఈ ప్రశాంత్ ?? అదే తెలియడం లేదు. తన ఎదుట ముసలీ ముతకా నేతలంతా తోక ముడిచిన రోజులను సోనియా ఎందుకు మరిచిపోయి ఈ ప్రశాంత్ ను నమ్ముతున్నారో! తేలని ప్రశ్న.