జగన్ అంటే సీఎం : సీనియర్లకు హడల్ ? జూనియర్లది డైలమా?
జగన్ అంటే సీఎం అని రాస్తున్న ఈ శీర్షికలో సీనియర్లకు ఎటువంటి ప్రాధాన్యం ఉంది అన్నదే కీలకం. మంత్రులంతా ఇవాళ నోరెత్తలే ని స్థితిలో ఉన్నారన్న యథార్థాన్ని అంతా ఒప్పుకోవాలి. ఆయన ఎవ్వరి ప్రాధాన్యంను తగ్గించరు.అలా అని పెంచరు.. తటస్థ స్థితిలో మంత్రి వర్గ అనుచరులను ఉంచుతున్నారు. ఇందుకు అనుగుణంగా రాజకీయం నడుపుతున్నారు. ముఖ్యంగా జలవనరుల శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ ఇలా కొన్ని శాఖల మంత్రులు పైకి మాట్లాడుతున్నా నిర్ణయాల అమలు, వాటి వెనుక ఉన్న ప్రతిపాదనలు అన్నీ కూడా జగన్ మాత్రమే చేస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని కీలక శాఖల నిర్వ హణ అన్నది మంత్రులు పైకి చేస్తున్నా తెర వెనుక మొత్తం నిర్ణయాలకు ఆయనే ఆధ్యుడు. దీంతో పాలనలో లోటు పాట్లకూ, గె లుపోటములకూ ఆయనదే బాధ్యత అన్న విధంగా పాలన ఉంది. జిల్లాలలో సైతం మంత్రులు ఏ నిర్ణయం స్వతంత్రంగా తీసుకునే ఛాన్స్ లేదన్న వాదన వస్తుం ది. అదేవిధంగా వివాదాలు ఏమయినా వాటిని ఒప్పుకునే స్థితిలోనే ఇవాళ జగన్ లేరు. చిత్తూరులో పెద్దిరెడ్డి, రోజా మధ్య వివాదాన్ని కూడా ఆయన ప్రోత్సహించలేదు. అదేవిధంగా సచివాలయంలో మంత్రులకూ, అధికారులకూ మధ్య గ్యాప్ వచ్చినా ఆయన కాస్త కూడా పట్టించుకోలేదు. జవహర్ రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ ల మాట కొన్ని సార్లు అయినా నెగ్గిందంటే కారణం వారి వెనుక ఉన్నది జగనే అన్నది జగద్విధితం.
వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. జగన్ కూడా విధేయులకు అనుగుణంగా పదవులు ఇస్తు న్నారు. బొత్స లాంటి లీడర్లను పూర్తిగా పక్కన పెట్టి మరీ! జగన్ తనదైన ఏకస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తుండం కొన్ని సార్లు వివా దాలకు తావిచ్చినా వాటిని సైతం దాటుకుని ఆయన రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి లాంటి నాయకులు సైతం పైకి ఏ మీ మాట్లాడలేని స్థితికి జగన్ తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్లంతా ఎప్పటి నుంచో నిశ్శబ్దంగా ఉండిపోవడం ప్రారంభించారు.కానీ ఇదే సమయంలో జూనియర్ ఎమ్మెల్యేలంతా తమకు అప్ప గించిన పనుల నెరవేర్పులోనే ఉండిపోయారు. పెద్దగా క్షేత్ర స్థాయి లో ప్రభావం చూపలేకపోయారు. ఈ పరిణామం జగన్ కు ప్లస్సా, మైనస్సా అన్నది ఇప్పటికిప్పుడు తేల్చలేం.
ఇదే సమయంలో అటు ఎమ్మెల్యేలకూ, ఇటు మంత్రులకూ పాలనకు సంబంధించి కొన్నింట అవగాహన లేమి కొట్టొచ్చిన విధంగా కనిపిస్తోంది. శాసన సభ వ్యవహారాలపై ఈ రోజుకీ కొందరికి అవగాహన లేమి పుష్కలంగా ఉంది. తమ జిల్లాకు ఏం కావాలో అడిగి చేయించుకునే ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు వేళ్ల మీద లెక్కించవచ్చు. అసెంబ్లీలో గుణాత్మక రీతిలో మాట్లాడే ఎమ్మెల్యేలూ తక్కువే! పాలనకు సంబంధించి జిల్లా సమీక్షల్లో కూడా వీరి పాత్ర అంతంత మాత్రమే అన్న విమర్శ కూడా ఉంది. సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం తమదైన పంథాలో అధికారులను నిలదీయగలుగుతున్నా కావాల్సిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోతు న్నారు. మంత్రులలో సీదిరి చాలా వేగంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారన్న కామెంట్ ఉంది. అదే దశలో ఆయన సొంత నియోజకవర్గం పలాసలోనూ అధికారులతో తగాదాలు ఉన్నాయి. ఈ విషయం ఒకటి మినహాయిస్తే అధికారులను పరుగులు తీయించగల మంత్రి ఆయనే అన్న పేరు కూడా ఉంది. మిగతా మంత్రులలో బొత్స ఎప్పుడో యాక్టివ్ గా ఉండడం మానుకున్నా రు. రేపటి వేళ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్లకు పదవి వచ్చినా ఆయనే పాటి పనిచేస్తారో అన్నదే కీలకం. ఏదేమైనప్పటికీ కొత్త ఎమ్మెల్యేలు జగన్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు అన్న విమర్శను కొంతయినా అంగీకరించే స్థితిలో వైసీపీ ఉండాల్సిందే