ఢిల్లీని వదిలిన కరోనా.. ఆ రాష్ట్రాన్ని మాత్రం వదలడం లేదుగా..?

Chakravarthi Kalyan
కరోనా మన దేశంలో పెద్దగా విజృంభణ లేదు. కరోనా మూడో వేవ్ రాబోతుందని కొన్నిరోజుల క్రితం వరకూ అంచనాలు ఉన్నా.. అది నిజం కాదని కొన్ని రోజుల నుంచి వస్తున్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే కరోనా దేశంలోని ఓ రాష్ట్రాన్ని మాత్రం వదలడం లేదు. దేశంలోని కరోనా మరణాల్లో దాదాపు సగం కేసులు ఆ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఆ రాష్ట్రమే కేరళ.. అవును.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నా.. కేరళను మాత్రం వదలడం లేదు.

కేరళను కరోనా మహమ్మారి పట్టి వేధిస్తోంది. అక్కడ రోజూ 20వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా కొత్తగా 20,452 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ కేరళలో  మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 62వేలు దాటాయి. కేరళలో మరణాల సంఖ్య 18వేలు దాటింది. ఇంకా అక్కడ లక్షా 80వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. భయంకరం ఏంటంటే.. కేరళలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 14.35శాతంగా ఉంది. అక్కడ తాజాగా లక్షా 42వేల నమూనాలను పరీక్షించగా పాజిటివిటీ రేటు 14.35శాతంగా తేలింది. ఒక్క మలప్పురంలోనే  అత్యధికంగా ఒక్కరోజే 3010 కేసులు నమోదు అయ్యాయి.

ఇక కేరళలోని కొళికోడ్‌లో 2426, ఎర్నాకులంలో 2388 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. అయితే కేరళను వేధిస్తున్న కరోనా ఢిల్లీని మాత్రం కరుణించింది. ఒకప్పుడు దేశ రాజధానిని వణికించిన కరోనా వైరస్‌.. ఇప్పుడు బాగా నియంత్రణలోకి వచ్చింది. తాజాగా అక్కడ కేవలం 50 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా మరణాలు ఏమీ కేసులు నమోదు కాలేదు. వరుసగా మూడో రోజు ఢిల్లీలో కొవిడ్‌ మరణాలు సంభవించలేదు.

ఢిల్లీలో  సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పటివరకు కొవిడ్‌ మరణాలు చోటుచేసుకోకపోవడం  ఇది తొమ్మిదోసారి. వరుసగా మూడో రోజు కూడా ఢిల్లీలో కొత్త మరణాలు లేవు.. ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.07శాతంగా ఉంది. మొత్తం మీద ఢిల్లీలో కరోనా బాగా కంట్రోలైందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: