ఆగస్టు భయాల్లో అధినేత ?
తెలుగు దేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల బలం మరొకరికి లేదు. ఆ పార్టీ వినిపించినంత ఆత్మ గౌరవ నినాదం మరో పార్టీ వినిపిం చేందుకు సాహసం చేయలేదు. తెలుగు వారిని కొంత కాలం కాంగ్రెస్ లాంటి కొన్ని ఢిల్లీ పార్టీలు అశాంతికి గురిచేసిన సందర్భాల్లో ఈ పార్టీనే పెద్ద దిక్కు అయింది అన్నది కాదనలేని వాస్తవం. కాలానుగుణంగా టీడీపీకి ముందున్నంత శక్తి లేదు. ఇక వస్తుందని చెప్పలేం కూడా! కానీ ప్రయత్నించడమో,తప్పులు దిద్దుకో వడమో చేస్తే తప్పక పూర్వ వైభవం అందుకుంటుంది అని పరిశీలకులు చెప్పే మాట. ఒకనాటి ఎన్టీఆర్ ఆశయాలు వాటి సాధన ఇప్పుడు లేకపోయినా కనీసం ప్రాంతీయ ప్రయోజనాల కోసం అయినా చేసే పోరాటం ముందు న్న కాలంలో పార్టీకి అత్యంత సానుకూల అంశం కావొచ్చు. రాయలసీమ కేంద్రంగా కొందరు నేతలు త మ అసంతృప్తిలో భాగంగా పక్క పార్టీల వైపు చూడొచ్చునేమో కానీ సొంత పార్టీలు పెట్టేంత శక్తి అయితే వారికి లేదు. ఆ విధంగా ఇప్పటికిప్పుడు టీడీపీ సేఫ్. మరో ఆగస్టు భయం ఎలానూ ఉంది కనుక పార్టీని ముంచే నాయకులు ఎవ్వరన్నది? కోవర్టులు ఎవ్వర న్నది? చంద్రబాబు గుర్తిస్తే మేలు.
యువ నాయకుడు లోకేశ్ ను ఒప్పుకోని వారు వేరు కుంపటి పెట్టేందుకు తమకున్న పరిధిలో ఆలోచన చేయవచ్చు. చంద్రబాబు రాజకీయం అర్థం కాని వారు తమని తాము వంచించుకోలేక వేరు కుంపటి పెట్టవచ్చు. ఇ వన్నీ ఎందుకు కొన్ని చీలికలు వచ్చేం దుకు ఎవరో ఒకరు కారణం కావొచ్చు. ఎన్టీఆర్ ను అవమానపర్చిన పార్టీ అని వైసీపీ,లేదు ఆయనే మాకు దేవుడు అని టీడీపీ ఇ వాళ్టి కీ పెద్దాయనపై పేటెంట్ కు తెగ ప్రయత్నాలు చేస్తున్న దశలో మరో ఆగస్టు భయం ఉంటే ఉంటుంది కానీ ఇప్పటికిప్పుడు పార్టీ మునిగిపోయిన నావ అయితే కాదు.
తెలుగుదేశం పార్టీని గత కొంత కాలంగా శాసిస్తున్న శక్తులకు భయాలు కొత్తకాకపోయినా ఆత్మ గౌరవం అన్న పదం దగ్గర ఇప్పటికీ ఓడిపోయిన నాయకులు ఎందరో? ఒకప్పుడు కేవలం తెలుగు వారి ఐక్యత కోసమే అన్న నినాదంతో పనిచేసే పార్టీ ఇప్పుడు మాత్రం తమ కోసం మాత్రమే అన్న విధానం వరకూ తన గొడవ వినిపిస్తుంది. పాలకులతో ప్రభుత్వాలతో కర్రపెత్తనం చెల్లాయించిన రోజు ఇ ప్పుడు లేదు కానీ ఉన్నంతలో కాలం వెళ్లదీయ డం మినహా చేయదగింది ఏమీ లేదు.ముందు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చెప్పడం అంత సులువు కాకపోయినా అప్పటి నుంచి ఇప్పటివరకూ పార్టీ ఏక స్వామ్య వ్యవస్థ ప్రమాదకారి శక్తిగా పరిణమించేందుకే అవకాశాలు ఎక్కువ.