హుజురాబాద్ లో ఈటలకు ఇంతమంది తెరాస నాయకుల సపోర్ట్ ఉందా..?

MOHAN BABU
హుజురాబాద్ నియోజకవర్గం లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ప్రజలను ఆకట్టుకోవడానికి గులాబీ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస పార్టీకి మరొక ముప్పు వచ్చి పడింది. నియోజకవర్గానికి చెందినటువంటి మండల మరియు గ్రామ స్థాయి  తెరాస నాయకులు కొందరు నాయకులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. ఇలాంటి నాయకులు తీరుతో  టిఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది అని చెప్పవచ్చు. ఎలాగైనా హుజురాబాద్ లో విజయం సాధించాలని సీఎం సహా టిఆర్ఎస్ నాయకులు అంతా వ్యూహాలు రచిస్తూ ఉంటే మరోవైపు కొందరు నాయకులు వ్యవహరిస్తున్న  తీరుపై అంతర్గతంగా చర్చలు చేయడానికి దారితీస్తోంది. ఈటెలను విడిచిపెట్టి టిఆర్ఎస్ లో చేరినటువంటి కొందరు నాయకులు అంతర్గతంగా ఈటల గెలుపు కోసం పనిచేస్తున్నారని  సమాచారం.


ఈ విషయం టిఆర్ఎస్ లోని ముఖ్య నాయకుల వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్ లో ఈ కొందరి నాయకుల తీరును తెలుసుకున్నటువంటి నేతలు వారికి చెక్ పెట్టేందుకు స్కెచ్ లు కూడా వేస్తున్నారని సమాచారం. అయితే బీజేపీకి మద్దతు ఇచ్చే నాయకులను డైరెక్టుగా మందలిద్దామంటే వ్యతిరేక ప్రభావం ఎక్కువైపోతుంది అని, ఒక వేళ కాదు అని వదిలేస్తే ఇంక వేరే అయిపోయే అవకాశం ఉందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు.


 ఈ వ్యవహారానికి సున్నితంగానే చెక్ పెట్టాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ లో ఉంటూ  బిజెపి కోవర్టులుగా పని చేస్తున్నా నాయకుల యొక్క చిట్టాను నిఘా వర్గాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈటల గెలుపుకోసం రహస్యంగా సమీకరణాలు చేస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా హుజురాబాద్ లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ, ఏ నాయకుడు ఎప్పుడు ఎటు జంప్  అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ప్రజలు చివరికి ఎవరికి పట్టం కడతారో ఎన్నికల అయితే గాని తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: