అల్లకల్లోలం అవుతున్నా.. చైనా అసలు నిజాన్ని దాస్తోందా?

praveen
కరోనా వైరస్ అనే ఒక బయో వెపెన్ తో ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు తీసుకు రావడానికి ప్రయత్నించింది చైనా.  చైనా ప్రపంచం మీదికి వదిలిన వైరస్ ఇప్పటికికూడా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా  ఊహించని విపత్తును సృష్టించిన చైనాకు ప్రస్తుతం  అదే రీతిలో ఊహించని విపత్తులు ఎదురుగా ఉంటుంది.  ప్రకృతికి విరుద్ధంగా చైనా చేపట్టిన పనులు ఇక ఇప్పుడు అక్కడి ప్రజల పాలిట శాపంగా మారింది.  అంతేకాదు అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి ఎన్నో ప్రకృతి విపత్తులు.  ఇప్పటికే చైనా సృష్టించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.

 ఇక ఈ వైరస్ ద్వారా రూపాంతరం చెందిన డెల్టా వేరియంట్ డెల్టా ప్లస్ వైరస్ లు మళ్ళీ చైనాలో విజృంభిస్తున్నాయ్.  దీంతో రోజురోజుకి చైనా లో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం వైరస్ కారణంగా నాలుగు కోట్ల మంది ప్రజలను లాక్ డౌన్ లోకి నెట్టింది  దీంతో ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోతుంది  అదే సమయంలో ఇక ప్రస్తుతం చైనాలో వరదలు కూడా అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి.

 చైనాలోని 25 నుంచి 30 శాతం భూభాగం వరదలతో అతలాకుతలం అయింది.  అయితే ప్రపంచంలోనే అత్యధిక వంతెనలు నిర్మించిన దేశంగా ఉంది చైనా. కానీ ఇటీవలే వచ్చిన వరదల కారణంగా ఎంత మంది చనిపోయారో..  ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చాయి అన్న విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అసహజమైన నీటి వంతెనల కారణంగా చైనా ఏకంగా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టేసింది. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాణాలు వంతెనలు కూలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఏకంగా ఆరు కోట్ల వరకు ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారట. ప్రకృతి ఉగ్రరూపం దాల్చడంతో వచ్చిన వరదల కారణంగా ఎంతో సంక్షోభం ఏర్పడిందని.. కానీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా చైనా దాస్తుంది అంటూ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: