సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనటువంటి కొత్త కొత్త పథకాలను తీసుకు వస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు ప్రకటించి దేశంలోనే చిరస్థాయిగా నిలిచిపోయారు. దీంతో పాటుగా కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, ఇలా పలు రకాల పథకాలతో ప్రజలందరికీ మేలు చేస్తున్నారని అని చెప్పవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో మరో పథకంతో సంచ లనం సృష్టించారు కేసీఆర్. అదే దళిత బంధు. ఈ పథకం ద్వారా దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకు వచ్చాను అని ఆయన అన్నారు. రైతన్నల కొరకు రైతుబంధు, దళితుల కొరకు దళిత బందును తీసుకువచ్చినటువంటి తెలంగాణ సర్కార్ ప్రస్తుతం బీసీలపై దృష్టి పెట్టింది అని చెప్పవచ్చు. త్వరలోనే అర్హులైన బీసీల అందరికీ లాభం చేకూరేలా మరో కొత్త పథకం రూపొందిస్తుందని తెలుస్తూ ఉన్నది.
దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు స్వయంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానికి అనుగుణంగా అనేక పథకాలను తీసుకొస్తోంది. వాటిని అమలు పరుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ముందుగా హుజురాబాద్ లో ప్రారంభిస్తానని చెప్పింది. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం అయినా వాసాలమర్రి లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన టువంటి దళితులు అందరికీ వారి అకౌంట్ లో పది లక్షల రూపాయలను జమ చేశారు. త్వరలోనే ఈ యొక్క పథకాన్ని హుజురాబాద్ లో కూడా ప్రారంభించనున్నది.
ఈ పథకం ప్రారంభించడంతో బీసీ సామాజిక వర్గాల నుంచి దళితులకే పథకాలు ఇస్తారా బీసీలకు ఇవ్వరా అంటూ ఒత్తిడి వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ బీసీల కొరకు కూడా ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకు వస్తున్నారని సమాచారం. ఈ పథకాన్ని రూపకల్పన చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దళిత బంధు అయితే ఎలాగా ఉన్నదో ఆ విధంగానే బిసి బంధు కూడా ఉండాలని, ఆ పథకానికి ఏ పేరు పెట్టాలో చర్చించాలని కెసిఆర్ అధికారులకు తెలిపారు. దీంతోపాటుగా చేనేత కార్మికులను ఆదుకోవడానికి కూడా పథకం తీసుకురావడానికి నిర్ణయించారు. బీసీల కొరకు తీసుకువచ్చినటువంటి పథకం త్వరలోనే వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.