కేరాఫ్ ఆంధ్రా.. : కుల‌మేరా అన్నింటికీ మూలం?

RATNA KISHORE

ఈ రాజ్యంలో ఎవ్వ‌రికీ బ‌తుకు లేదు

అన్న‌ది తేలిపోయింది



అమ‌రావ‌తికి ఉనికే లేదు

ద‌ళితులు వేరు ద‌ళారీ ద‌ళితులు వేరా?



ఏమో ఇది కూడా వారే చెప్పాలి

కులాల‌కూ సామాజిక‌వ‌ర్గాల‌కూ

ఏదో ఒక‌టి చేయ‌డంలోనే

మీ మీ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి త‌ప్ప

సంక్షేమం అంతా బూట‌క‌మే అని తేలిపోయింది



రెండు బ‌ల‌మ‌యిన సామాజిక‌వ‌ర్గాల కొట్లాటలో

ప‌వ‌న్ సైలెంట్ అయిపోయారు బొత్స కూడా

ఇంకేం చేస్త‌రు...ఇదీ ఆంధ్రాలో న‌యా రాజ‌కీయం




డ‌బ్బులు పంచే క్ర‌మంలో కులాల ఉనికి పైకి వ‌స్తే, ప్ర‌గ‌తి మాత్రం అంధ‌కారంలో ఉండిపోతోంది.రెండే రెండు కులాల  పోరులో భాగంగా ఆంధ్రావాకిట న‌డిచే రాజ‌కీయాలు వాళ్ల‌కు మించి వీళ్లు,వీళ్ల‌కు మించి వాళ్లు అన్న విధంగా రాజ‌కీయం సాగుతోంది.మీడియాను కూడా త‌మ‌కు అనుగుణంగా పంప‌కాలు చేసుకున్న ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌దే ఆంధ్రా!ఇంకెవ్వ‌రిదీ కాదు..ఇంకెవ్వ‌రికీ చిక్క‌దు.కాపు సామాజిక‌వర్గం ప‌ట్టు తెలంగాణ‌లోనూ ఆంధ్రాలోనూ ఉంది కానీ ఆ సామాజిక‌వ‌ర్గం ఉనికి లేకుండా చేయ‌డంలో ఈ సారి జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారా అ న్న‌ది ఓ ప్ర‌శ్న లేదా ఓ సందేహం.ప‌వ‌న్ ను టార్గెట్  చేసేందుకు కొంద‌రిని,బాబును టార్గెట్  చేసేందుకు కొంద‌రిని నియ‌మించి తిట్టించి వారికి మ‌నుగడ లేకుండా చేయ‌డంలో జ‌గ‌న్ త‌న అధికారం వినియోగించుకుంటున్నార‌ని రాజ‌ధాని రైతులు మండిప‌డుతున్నారు.త‌మ క్షేమం ప‌ట్ట‌ని పాల‌కుల కార‌ణంగా ఏం చేయాలో తోచ‌డం లేద‌ని,తాము రాజ్యం కొట్లాట‌లో ఆర్థికం గా న‌లిగిపోయామ‌ని వేద‌న చెందుతున్నారు.




రెండున్న‌ర ఏళ్ల పాల‌న‌కు సంబంధించి జ‌గ‌న్ సాధించింది,పీక్కుతిన్న‌ది కేవ‌లం ఒక సామాజిక‌వ‌ర్గాన్ని మాత్ర‌మే!కొడాలి నాని లాంటి వారిని అడ్డం పెట్టుకుని చంద్ర‌బాబును తిట్టించే ప నిలో స‌క్సెస్ అయిన జ‌గ‌న్ ఇదే పంథాలో ముందున్న కాలంలోనూ రాజ‌కీయం చేయ‌నున్నార‌ని తేలిపోయింది.సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో కేంద్రం నుంచి అభ్యంత‌రాలు ఉన్నా పట్టిం చుకోకుండా చెప్పాడంటే చేస్తాడంతే అన్న డైలాగ్ మాత్రం వినిపించి,అదుపు లేకుండా డ‌బ్బులు పంచ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌ని వినిపిస్తున్న మాట.ఇదే కొన‌సాగితే ముం దున్న కాలంలో ఆయ‌న‌కు గ‌డ్డు కాలం త‌ప్ప‌ద‌ని, ఒక సామాజిక వ‌ర్గం అభ్యున్న‌తే ధ్యేయంగా ఉండ‌డం, ఒక సామాజిక వ‌ర్గాన్ని పూర్తిగా టార్గెట్ చేసి పాల‌న సాగించ‌డం స‌బ‌బు కాద‌ని ప‌రిశీ ల‌కులు చెబుతున్న మాట.వాస్త‌వానికి ప్ర‌తి పార్టీలో రెండు ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాలు ఉంటాయి.అవి త‌మ త‌మ ఉనికిని చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ప్ర‌ధా నంగా జ‌గ‌న్ మాత్రం బాబు అండ్ కో ఆర్థిక మూలాలు దెబ్బ‌తీసేందుకే టార్గెట్ చేస్తున్నార‌న్న‌ది సుస్ప‌ష్టం.బాహాటంగానే ఈ విష‌యం వైసీపీ ఒప్పుకున్న సంద‌ర్భాలూ ఉన్నాయి. ఇప్పు డు అమ‌ర్ రాజా కంపెనీ పోయినా రేపు అమ‌రావ‌తి మూలాలు పూర్తిగా కొట్టుకుపోయినా అదంతా టీడీపీని ముంచే ప‌ని అని భావిస్తూ వైసీపీ ముందుకు పోతుందే కానీ సామాన్యుల గోడు అక్క‌డ ఉన్న స్థానిక నేప‌థ్యం ఆర్థిక నేప‌థ్యం ఇవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు.ద‌ళారీ ద‌ళితులు అన్న ప‌దం ఎంత త‌ప్పో వాళ్ల‌కు అర్థం కావ‌డం లేదు.టీడీపీకి చెందిన వారు కొంద‌రు అమ‌రావ‌తి ప‌రిక్ష‌ణ పేరిట ఉద్య‌మించి,పోరు బాట‌లో ఉన్నారు క‌నుక ఈ మాట అన్నారా లేకా మ‌రో ఉద్దేశ‌మా అన్న‌ది వైసీపీనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: