సంజయా! కానిమ్ము : చంద్రుడిని మించు..!
రింజిమ్ రింజిమ్ హైద్రాబాద్ ను
ఏం చేస్తారు
రిక్షావాలాలు జిందాబాద్ కొట్టిన
నా హైద్రాబాద్ ను ఏం చేస్తారు
ఆ సైబరాబాద్ ను ఏం చేస్తారు
కొన్ని కలలను అమ్మేసి
మీరు సుఖంగా ఉంటామంటే
కేసీఆర్ ఒప్పుకోరు
కేంద్ర పాలిత ప్రాంతమా?
ఎందుకు?
డ్రామాలు ఆపండి?
తెలంగాణలో ఓ కార్పొరేటర్
స్థాయి నుంచి ఎన్నికలు
నడపాల్సిన వ్యక్తి సంజయ్
కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి
స్థాయిలో లేదా కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డి హోదాలో రాజకీయాలు
నడపాలని ఆశపడుతున్నారు
తెరపైకి మళ్లీ పాత ప్రతిపాదన ఒకటి తవ్వితీశారు బీజేపీ గ్యాంగ్..గ్యాంగ్ అండ్ వార్ ఒక్కసారే స్టార్ట్ అయిపోయాయి.తీన్మార్ మల్ల న్నతో ఆడిస్తున్న ఆటలో కొత్త మలుపు ఇది.హైద్రాబాద్ ను యూటీగా చేయాలన్న ప్రతిపాదనతో సంజయ్ అండ్ కో రాష్ట్ర రాజకీ యంను తనవైపు తిప్పుకుంటోంది.సమైక్య ఉద్యమాల సమయంలో ఈ ప్రాంతాన్ని రెండో రాజధానిగా ప్రకటించాలన్న వాదన ఉండేది. కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదు. ఆదాయం ఇచ్చే రాజధాని ఎలా వదులుకోగలం అని ఆయన చెప్పారు. అంతేకా కుండా తనకు తెల్సిన సెంటిమెంట్ రాజకీయం నడిపారు.
కానీ అందుకు అనుగుణంగా కేంద్రం కూడా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. దాంతో కేసీఆర్ సేఫ్...టీఆర్ఎస్ కూడా సేఫ్.. ఒకప్పుడు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలానే మాట్లాడే కేసీఆర్ ఇప్పుడు తగ్గినా ఆ ఊపు ఆ జోరు సంజయ్ అందుకున్నారు అన్నది వాస్తవం. సంజయ్ కేసీఆర్ ను ఇమిటేట్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో పేరు తెచ్చుకోవాలని పరితపిస్తున్నారు. ఇది సాధ్యమా కాదా అన్నది వేరు సంగతి కాని సంజయ్ కు క్యాస్ట్ పాలిటిక్స్ చేయడం చేత గాక ఇలా పాత రూల్స్ ను రైమ్స్ ను చదువుతున్నారు అని పలువురు పేర్కొంటూ నవ్వుకుంటున్నారు. వాస్తవానికి బీజేపీలో కూడా కేసీఆర్ మనుషులంతా దండీగా ఉన్నారు. కేసీఆర్ త్వరలో ఢిల్లీ లో చక్రం తిప్పితే అప్పు డు అక్కడ కూడా బీజేపీకి గట్టి పోటీ తప్పదు. అందుకని ఆయన నమ్ముకున్న హైద్రాబాద్ ను ఆయనకు కాకుండా చేసి ఓ చెత్త ప్రకటన ఒకటి కేంద్రంతో ఇప్పించి డ్రామా ఆడేందుకు సిద్ధపడుతున్నారు బీజేపీ నాయకులు అ ని టీఆర్ఎస్ శ్రేణులు,కేసీఆర్ అభిమానులు మండి పడుతున్నారు.