గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?
ప్రపంచం గౌరవిస్తే
మనం సిగ్గుతో చచ్చిపోయే
పనులు చేస్తాం
తోటి దేశం కూడా కరిగి కన్నీరయ్యేలా
పనిచేస్తే మనం గుర్తించనే గుర్తించం
పీవీ సింధు ఇందుకు మినహాయింపు కాదు
ఆ కష్టం ఆ ఒత్తిడి ఇంకా దాటనే లేదు
మీరు మాత్రం వెతకండి ఆమెది ఏ కులమో!
మేరా భారత్ మహాన్ .. సెబ్బాస్ రా!
మనుషులు అనే పదంలో
మలినం ఉంది
వారి హృదయాలకు
చేసే పనులకూ ఆ మలినం
ఇంకా అంటుకుని ఉంది
ఇప్పుడు కులం ఏంటి?
ఏం చేస్తుంది?
అవన్నీ వద్దు జరగాల్సిన
పంచాయతీ జరిగిపోయె
కోట్ల ప్రజల కలకు
అర్థం లేకుండా పోయింది
కేవలం కులం కార్డు ఒక్కటి
అడ్డొచ్చి పడింది
మనుషులు గోడలు కట్టి
సంకెళ్లు వేసి మరీ! తమని తాము
విభజించుకుంటారు అనేందుకు తార్కాణం
ఇప్పుడు గోడలు కూల్చడం
గూగుల్ సెర్చ్ వర్డ్స్ మార్చడం
మనతో కుదరని పని
కనీసం విజేతను గౌరవించలేమా!
శ్రమకు విలువ లేదు.. కష్టానికీ విలువ లేదు.. గౌరవనీయం అయిన విజయాలపై మనకు నమ్మకం లేదు పీవీ సింధూ ఏ కులం ఇదీ ఇప్పుడు వైరల్ పాయింట్ . కాదండి వైరస్ పాయింట్.. ఈ దేశంలో కొన్ని జబ్బులకే వి రుగుడు.. కులం అనే జబ్బు కూ ఇంకా చెప్పాలంటే ఆ గజ్జికి మందులేదు విరుగుడూ లేదు. ఎన్నో రోజుల ప్రాక్టీసు ఎన్నో రోజుల తపన నాన్న గురువు శిక్షకుడి కలలను సాకారం చేసిన ముచ్చట మాత్రం మనకు గుర్తుకు రాదు.. ఆమెది ఏ కులం ఏ వర్గం.. అమ్మది ఏ కులం నాన్నది ఏ కులం అన్నవే స్పురణకు వస్తాయి. ఇదే మన భారత దేశం మేరా భారత్ మహాన్.
భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని జాడ్యాలూ ఉన్నాయి. ఆంధ్రావనిలో ఈ జాడ్యాలు పెచ్చుమీరిన ప్రతిసారీ వివాదాలు రేగుతున్నాయి. ప్రభుత్వాలేమయినా వీటికి అతీతమా.. రాజకీయం ఏమయినా ఇందుకు అతీతమా.. కానీ మనం ఎవ్వరిని ఎలా గుర్తించి గౌరవించాలో తెలియదు.. జాషువా ఓ చోట అంటాడు ఇనుప గజ్జెల తల్లి అంటూ తన దరిద్రాన్ని అలా పోలుస్తాడు అలానే ఈ ఇనుప గజ్జెల తల్లి ఆ నాల్గు పడగల హైందవ నా గరాజు ఎన్నడూ మన వెంటే .. మనం కాదనుకున్నాం మనం వద్దనుకున్నా ఈ పడగ నీడల్లో కాలం వెచ్చించి రావాల్సిందే!