మళ్లీ కొట్లాట వాళ్లనేం అనొద్దు
మీరు తన్నుకోండి మేం చూస్తాం.. మీరు తిట్టుకోండి మేం వింటాం ఇదే సభల తీరు. ఏం అనకండి వాళ్లంతా పెద్దవాళ్లు.. కేవలం మ న కోసమే పోరాడుతున్న వారు.. వారికి దేశ ప్రయోజనాల కన్నా మించింది మరొకటి లేదు. ఈ సమాచార గోప్యత అన్నది ఇప్పు డు కాదు ఎప్పుడూ సజావుగా జరిగింది లేదు కదా! ఎప్పటి నుంచో ఫోన్ హ్యాకింగ్, మెయిల్ హ్యాకింగ్ లాంటివి ఉన్నాయి కదా.. అయినా అంత వీక్ మైండెడ్ లీడర్స్ అంతా ఈ దేశంలో ఉన్నారా? లేదా వీళ్లంతా అన్ని స్కాంలకు ఆజ్యం పోసేలా ప్రణాళికలు ఏమ యినా రచిస్తున్నారా.. ఎందుకయ్యా భయం.
ఇదంతా కాంగ్రెస్ నడిపిస్తున్న నాటకం అని బీజేపీ, లేదు మీ నాటకమే అని కాంగ్రెస్ ఈ విధంగా ఒకరినొకరు ఆడిపోసుకున్నా వి లువైన ప్రజాధనం, అంతకుమించి విలువైన సభా సమయం అన్నీ వృథా అవుతున్నాయి. కానీ ఇవేవీ పట్టని సభ్యులకు తమ మాటే గెలవాలన్న పంతం తప్ప మరొకటి లేదు. ప్రజాస్వామ్య ఖూని అన్న పదాన్ని ఎన్ని సార్లు వాడినా ఒనగూరే ప్రయోజనం లేదు.. ఎందుకంటే ఆ పని చేస్తుంది అటు విపక్షం ఇటు స్వపక్షం కూడా..
ప్రజా సమస్యల ప్రస్తావన అన్నదే లేకుండా,కీలక అంశాలపై చర్చ అన్నదే లేకుండా లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సభ్యుల గందరగోళం తప్ప చర్చకు కనీసం పట్టుబట్టిన దాఖలాలు కూడా లేవు. పెగాసస్ పై దుమారం రేగడంతో విపక్ష సభ్యుల ఆందో ళనల కు అడ్డూ అదుపూ లేకపోవడంతో చేసేది లేక స్పీకర్ సభను వాయిదా వేశారు. మరో వైపు రాజ్యసభలోనూ ఇదే వాతావ రణం నెల కొంది. కాంగ్రెస్ తో సహా సంబంధిత మిత్ర పక్షాల వైఖరి కారణంగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ వెంకయ్య నాయు డు అసహనా నికి గురయ్యారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి ఇదే వాతావరణం నెలకొనడంతో ఇరు సభలూ ఇలానే నడుస్తున్నాయి. ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం లేక దేశం సతమతమవుతున్న తరుణంలో సభ్యుల ప్రవర్తనపై విమర్శలు పోటెత్తుతున్నాయి. అయినప్పటికీ తామేం చెప్పాలో అదే చెబుతామని, తాము కోరిన మేరకే సభను నడపాలని విపక్షాల మాటలా అందుకు అనుగు ణంగా సభలో పోకడలు ఉన్నాయి. అర్థవంతం అయిన చర్చలు లేనప్పుడు సభలు ఎందుకు అని అంతా ప్రశ్నిస్తున్నా, విపక్షాలు మాత్రం పట్టు వీడడం లేదు. కరోనా కారణంగా గత ఏడాది షెడ్యూల్ ప్రకారం వర్షాకాల సమావేశాలు జరగలేదు. ఈ ఏడాది జరిగినా ఫలితం శూన్యం. ఇలానే కొనసాగితే కీలక అంశాలన్నీ చర్చకు రాకుండానే మరుగున పడిపోయి బీజేపీని హాయిగా ఉంచుతాయి.