షర్మిల దీక్ష వేళ రాజగోపాల్ రెడ్డి ఫోన్ వెనక ఆంతర్యం ఇదేనా..?

MOHAN BABU
నిత్యం కాంగ్రెస్ పార్టీని స్మరిస్తూ ఆ పార్టీ ఎదుగుదల కోసం, తనకు మించిన కమిట్మెంట్ మరెవరికీ లేదన్నట్లుగా వ్యవహరించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తెలిసినంత మరెవరికీ తెలియదేమో. ఒకవైపు పార్టీ గురించి మాట్లాడుతూనే, మరోవైపు పార్టీకి భిన్నంగా వ్యవహరించడం వారిద్దరికీ కొత్తేమీ కాదు. ఎప్పుడూ వారు అదో తీరును ప్రదర్శిస్తూ ఉంటాడు. పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు పోటీపడడం. ఈ తరుణంలోనే ఆ పదవిని రేవంత్ రెడ్డికి అప్ప చెప్పడం తెలిసిందే. పిసీసీ పదవి ప్రకటన వెలువడిన వెంటనే రేవంత్ పై  మండి పడినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ తర్వాత  సర్దుకున్నట్లుగానే వ్యవహ రిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తమదైన శైలిలో చురకలు వేస్తు మరోసారి వార్తల్లో కెక్కారు  ఈ బ్రదర్స్..

తాజాగా వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్షను మునుగోడు నియోజకవర్గంలోనీ పుల్లం గ్రామంలో చేపట్టారు. దీన్నే అవకాశంగా తీసుకున్న టువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తమ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి షర్మిలకు ఫోన్ చేసి  ఆమె చేస్తున్నటువంటి దీక్షకు  పూర్తి మద్దతు తెలుపుతున్నాను అని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏదో దాగి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ఫోన్ కాల్ లో ఆయన  మాకు రాజశేఖర్ రెడ్డి అంటే ప్రాణం, నేను బ్రతికున్నంత కాలం ఆయన మా గుండెల్లో ఉంటారు అని మునుగోడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందించేందుకు ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారని. అప్పుడే 90 శాతం పూర్తయినా ప్రాజెక్టును  ఇప్పటికీ ఈ గవర్నమెంట్ పూర్తి చేయలేదనీ మండిపడ్డారు. మా ప్రాంతంలో వైయస్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు కూడా ఉన్నారని అని తెలియజేశారు.  మీరు చేపట్టినటువంటి ఈ నిరుద్యోగ దీక్ష సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని  పూర్తి మద్దతు ప్రకటించారు. తాను ఈరోజే ఢిల్లీకి వచ్చానని, లేదంటే మిమ్మల్ని కలిసే వాడినని రాజగోపాల్ రెడ్డి షర్మిలకు చెప్పాడు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ  రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం కనిపిస్తోంది. మరోవైపు ఇదే సామాజిక వర్గానికి ప్రతినిధిగా  వ్యవహరిస్తున్న షర్మిల ఏకంగా పార్టీనే పెట్టారు.

ఈ సందర్భంలోనే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి షర్మిలకు ఫోన్ చేయడం వెనుక అంతర్యం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే షర్మిల ఫోన్ చేయడం వెనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఏ వైపు ఉంటారనేది  చాలా ఆసక్తికరంగా మారింది. ఆయన ఇప్పటికి ఇప్పుడు కాకున్నా సమయం సందర్భం చూసుకుని  వారు నిర్ణయం బయటపడే అవకాశం ఉందని, కాంగ్రెస్ లోనే ఉంటూ రేవంత్ చురకలు అంటిస్తూన్న వారు షర్మిల పార్టీ వైపు వెళ్తారా అనేది మనం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: