బ‌లిజ‌ల కోట‌లో టీడీపీ క‌మ్మ Vs వైసీపీ రెడ్డి పోరు.. బ‌లిజ‌లు ఇలా డిసైడయ్యారా ?

RAMAKRISHNA S.S.
- బ‌లిజ‌ల సంప్ర‌దాయ సీట్లో ఎర్ర‌చంద‌నం డాన్ విజ‌యానంద‌రెడ్డికి సీటిచ్చిన జ‌గ‌న్‌
- అనూహ్యంగా కమ్మ నేత గుర‌జాలను రంగంలోకి దింపిన బాబు
- కూట‌మి బ‌లం, సీకే బాబు.. బ‌లిజ నేత‌ల స‌పోర్ట్‌తో ఎడ్జ్‌లో టీడీపీ
( చిత్తూరు - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో చిత్తూరు కూడా ఒకటి. మామూలుగా అయితే చిత్తూరు బలిజ సామాజిక వర్గానికి సాంప్రదాయ సీటుగా వస్తోంది. గత కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ ఎక్కువగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఓటింగ్ పరంగాను.. రాజకీయపరంగాను.. బలిజ సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ. అలాంటి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేని త‌ప్పించిన జగన్.. తన సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

అయితే ఎప్పుడు బలిజలకే సీటు ఇచ్చే చంద్రబాబు కూడా అనూహ్యంగా నిర్ణయం తీసుకొని తన సొంత కమ్మ‌ సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీలోకి దింపారు. చిత్తూరు అసెంబ్లీకి వైసీపీ నుంచి ఎర్రచందనం డాన్‌గా పేరు తెచ్చుకుని ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయానంద రెడ్డి పేరు ముందుగానే ఖరారు అయింది. టీడీపీ నుంచి ఈ సీటు ఎవరికి ఇస్తారు.. లేదా జనసేనకు కేటా ఇస్తారా ?అన్న చర్చ జరిగింది. అయితే చంద్రబాబు అనూహ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన గురజాల జగన్మోహన్ కు కేటాయించారు.

బలిజల‌ కోటలో కమ్మ‌ వర్సెస్ రెడ్డి నేతల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు నేతల బలాబలాలు చూస్తే విజయానంద రెడ్డి పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారని, దండాలు అవినీతి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అఫిడవిట్లోనే తనపై ఉన్న కేసులు ఆరోపణల గురించి ప్రస్తావించుకోవలసిన పరిస్థితి. టీడీపీ అభ్యర్థి జగన్మోహన్‌కు వ్యక్తిగతంగా మంచివాడు, సౌమ్యుడు అన్న పేరు ఉంది. ఇక నియోజకవర్గంలో ఉన్న బలిజలతో పాటు కమ్మలు.. ఇతర బీసీ వర్గాలు జగన్మోహన్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

పైగా ఇక్కడ మంచి పట్టు ఉన్న మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు తెలుగుదేశం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా చేసినవారు. ఇక్కడ టీడీపీ, జనసేన నుంచి సీటు ఆశించిన ముగ్గురు నలుగురు బలిజనేతలు ఇలా అందరూ కలిసికట్టుగా జగన్మోహన్ వైపే ఉన్నారు. విజయానంద రెడ్డి గెలిస్తే అవినీతి ఆరోపణలు, దందాలు ఎక్కువవుతాయన్న ప్రచారం నియోజకవర్గంలో గట్టిగా నడుస్తోంది. ఇక బలిజలు కూడా జగన్ గెలిస్తేనే మాకు బాగుంటుంది. నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు ఉండవు ప్రశాంతంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు చిత్తూరు అసెంబ్లీ సీటు నుంచి కచ్చితంగా జగన్మోహన్ గెలుస్తారన్న అంచనాలు అయితే వచ్చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: