పెట్రో టాక్ : సొమ్మే సొమ్ము బ్రో
దాదాపు లక్షన్నర కోట్ల అధిక ఆదాయం..మీరు ఊహించలేరు.. మీరు అంచనా వేయలేరు .. కానీ ఇది నిజం..ఈ మొత్తాలను మీరు ఏం చేస్తారు అని అడగకండి కేంద్రానికి మరియూ రాష్ట్రానికి కూడా.. ఎందుకంటే మన సొమ్ము ఏం చేస్తారో అడిగే ధైర్యమో అధికారమో మనకు లేదు.. కానీ పన్నుల పెంపు బాధ్యత మాత్రమే కేంద్రం మరియూ రాష్ట్రాలది కావడం మనం చేసుకున్న అదృష్టాలలో ఒకటి కావొచ్చు. అయినా బెంగపడకండి ఈ డబ్బు అంతా ఉచితాలకే వెచ్చించే ప్రభుత్వాలు ఉన్నంత కాలం
పెట్రో ఉత్పత్తులేం ఖర్మ అన్ని ధరలూ చుక్కలు చూపించండి ఖాయం.
మీకు తెలియదు మీకు అర్థం కాదు పైసా పైసా మేం కూడితే అభివృద్ధి అందుకు పెట్రో నిధులు ఓ సాయం.. మీకు తెలియదు మీరు నమ్మరు.. మేం చేసేది నిర్ణయించేది.. మౌలిక వసతుల కల్పనకు పెట్రో అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాలే ఆధారం.. అంటే కేంద్రం డాంబికాలు పోతోంది.. పన్నుల తీరు కారణంగానే పెట్రో రేట్లు పెరిగి సామాన్యుడికి భారం అయిన పరిణామాలు ఓ వైపు ఉంటే ఇదే తరుణంలో కోట్లకు నిధులు చేరి ఊహించని ఆదాయం పెట్రో అమ్మకాల నుంచి పొంది తాము ఈ సొమ్ము అంతా దేశ సేవకే ఉపయోగిస్తున్నామని చెప్పడం కొసమెరుపు.
ధరలు తగ్గించమని అడిగితే ఆదాయం ఎలా వస్తుందని కేంద్రం తిరిగి ప్రశ్నిస్తుంది. ఆదాయం లేనప్పుడు పథకాల అమలు ఎలా అంటుంది.. పోనీ ఆదాయం వచ్చాక ఆ పైసలతో ఏం చేస్తారు అంటే సమాధానమే ఉండదు. పెట్రో అమ్మకాలతో కేంద్రం, రాష్ట్రాలు పొందిన ఆదాయం ఆరు వేల కోట్లకు పైగా అని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఐదేళ్లతో పోలిస్తే ఇరవై ఏడు శాతం అధికంగా తాము అమ్మకాల ద్వారా ఆదాయం పొందామని చెబుతోంది. కానీ ఆ లెక్కలు తరువాత ఆ సొమ్ముల చేరవేత తరువాత అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ తాము చేసిన లేదా చేయాలనుకున్న అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడవు.