ఒలింపిక్ విజేత మీరాబాయి చానుకు బహుమతులే బహుమతులు..!

Chakravarthi Kalyan
మీరాబాయి చాను.. ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు ఇది. చాలా కాలం తర్వాత ఇండియాకు ఒలింపిక్ పతకం సాధించిన పెట్టిన వనిత మీరాబాయి చాను. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో మీరాబాయి రజత పతకం సాధించింది. భారతదేశ కీర్తి పతాకాన్ని మరోసారి రెపరెపలాడించింది. ఇప్పుడు దేశమంతటా మీరాబాయి పతకం సాధించడం చర్చనీయాంశమైంది. మీరాబాయి చాను ఎవరు.. ఆమె గతం ఏంటి.. అన్న చర్చ సాగుతోంది.

మరోవైపు అదే సమయంలో మీరాబాయి చానుకు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. భారత సత్తాను ప్రపంచానికి చాటిన మీరాబాయి చానుకు ఆమె సొంత రాష్ట్రం మణిపూర్ భారీ నజరానా ప్రకటించింది. మీరాబాయి చానుకు రూ. కోటి రూపాయల నజరానా అందించనున్నట్టు మణిపూర్‌ సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌ స్వయంగా ప్రకటించారు. అసాధారణ ప్రతిభతో పతకం సాధించిన మీరాబాయికి రూ.కోటి నజరానాతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా మణిపూర్ సీఎం ప్రకటించారు.

ఒలింపిక్ పతక విజేతకు మరో ఉన్నత ఉద్యోగం రిజర్వ్‌ చేసి పెట్టినట్టు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. పతకం సాధించిన మీరాబాయి చానుతో బీరెన్ సింగ్ వీడియోకాల్‌లో మాట్లాడారు. మీరాబాయి చాను ఈ సందర్భంగా తన పతకం సాధించిన అనుభవాన్ని ఆయనకు వివరించింది. తాను రజతంతో సంతృప్తి చెందనని.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తానని ఆమె దీమా వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో బంగారు పతకాలు సాధిస్తానని  మీరాబాయి చాను సీఎంతో చెప్పారు.  

సీఎం బీరెన్‌ సింగ్‌ ఆమెతో చాలాసేపు మాట్లాడారు.. మీరాబాయి చాను విజయం పట్ల దేశం ఎంత గర్విస్తుంతో వివరించారు. షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశంలో మీరాబాయి  గెలుపు గురించి అందరికీ వెల్లడించిన విషయాన్ని ఆమెతో పంచుకున్నారు. తాను మీరాబాయి విజయం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోనూ మాట్లాడానని.. ఆయన కూడా ఎంతో ఆనందించారని సీఎం మీరాబాయి చానుతో తెలిపారు. మీరాబాయి చాను విజయాన్ని అభినందిస్తూ అమిత్‌ షాకూడా నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారని బీరెన్ సింగ్ చానుకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: