ఆ జగన్‌ను చూసి ఫాలో అవ్వండి.. కేసీఆర్‌ ఆదేశం..?

Chakravarthi Kalyan
ఏ రాష్ట్రంలోనైనా యువత కోరుకునేది ఉద్యోగాలే. ఇక తెలంగాణలో నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా.. ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదు. ఈ విషయంపై వారు  కేసీఆర్ ప్రభుత్వం పట్ల చాలా కోపంగా ఉన్నారు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా.. ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్లు రావడం లేదన్న ఆగ్రహం, ఆవేశం వారిలో కనిపిస్తున్నాయి.

అయితే తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లకు జిల్లాల పునర్విభజన ఓ పెద్ద అడ్డంకి కనిపించింది. అయితే ఇటీవల తెలంగాణ జిల్లాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి ఏళ్లు పట్టింది. మరోవైపు  హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముంచుకొస్తోంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ సర్కారు మరోసారి ఉద్యోగాలపై దృష్టి సారించింది. 50 వేలకుపైగా ఉద్యోగాలిస్తామని మరోసార చెబుతోంది.

అయితే.. ఉద్యోగాల విషయంలో ఏపీ సీఎం జగన్‌ను ఫాలో అవ్వాలని కేసీఆర్ డిసైడైనట్టు కనిపిస్తున్నారు. ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్ మంత్రివర్గం తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో అమలులోకి వచ్చిన కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయించారు.

 
అంతే కాదు.. ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఏపీలో ఇటీవల సీఎం జగన్ విడుదల చేసినట్టు తెలంగాణలోనూ జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏటా నియామకాల కోసం జాబ్ క్యాలెండర్‌ తయారు చేయాలని కేబినెట్‌ మీటింగ్‌లో కేసీఆర్ నిర్ణయించారు. అలగే ఉద్యోగ ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై చర్చించింది మంత్రివర్గం. అయితే ఈ అంశంపై చర్చ పూర్తికాకపోవడంతో రేపు కూడా చర్చించాలని నిర్ణయించారు. ఉద్యోగాల అంశంపై బుధ వారం మధ్యాహ్నం 2గంటలకు మళ్లీ సమావేశం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: