ఏపీ : 2008 డీఎస్సీ అభ్యర్థుల‌కు విద్యాశాఖ మంత్రి గుడ్ న్యూస్.. !

ఏపీ 2008 డీఎస్సీ అభ్య‌ర్థులకు సంబంధించిన అంశం మొదటి నుండి వివాదాల్లోనే ఉంది. దాంతో అభ్య‌ర్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా తాజాగా 2008 డీఎస్సీ అభ్య‌ర్థుల అశంపై విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ....దీర్ఘకాలికంగా 2000 మందికి పైగా డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తు పెండింగ్ లో ఉందన్నారు. డీఎస్సీ 2008 అభ్యర్ధులు ఎలిజిబిలిటీ క్రైటిరియా మార్పు వల్ల నష్టపోయారని వ్యాఖ్యానించారు. నియామకాల్లో ఇబ్బందుల వలన వారంతా ఇబ్బందిపడ్డారని మంత్రి అన్నారు. దీనికి సంబంధించి 10 సంవత్సరాల పాటు వారంతా కోర్టుల చుట్టూ తిరిగారని అన్నారు. 2014 లో హామీ ఇచ్చి వారిని చంద్రబాబు మోసం చేశారని వ్యాఖ్యానించారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చిందన్నారు. 2008 డీఎస్సీ అభ్య‌ర్థులంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు.... వారికి మేలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. సుమారు 4600 ల‌కు పైగా అభ్యర్థులను గుర్తించాం... కొందరు తర్వాత డీఎస్సిలో ఉద్యోగంలో చేరారని చెప్పారు. ఇప్పుడు మొత్తం 2193 మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నామని తెలిపిన‌ట్టు మంత్రి చెప్పారు. 2008 డీఎస్సీలో ఇబ్బంది పడిన వారిని కాంట్రాక్టు పద్దతిలో ఎస్జీటీలుగా నియమించాలని సీఎం ఆదేశించారన్నారు. త్వరలో ఇందుకు సంభందించిన ఉత్తర్వులు వెలువడతాయని మంత్రి వివ‌రించారు.

టీడీపీ లాగా తాము మేనిఫెస్టో లో పెట్టలేదని.... కేవలం హామీ ఇచ్చి మాత్ర‌మే జగన్ మాట నెరవేర్చార్చుకున్నార‌ని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు సమయం కోల్పోయారని అన్నారు. 2018 డీఎస్సీ కోర్ట్ కేసుల ద్వారా పెండింగ్ లో ఉన్న 400 ల‌కు పైగా పోస్టులకు అపాయింట్మెంట్ ఇస్తున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఏపీ టెట్ 2021 ప‌రీక్షకు సంబంధించిన‌ సిలబస్ ను  వెబ్సైట్ లో పొందు ప‌ర్చామ‌ని అన్నారు. సిల‌బ‌స్ తెలుసుకోవాలంటే  https://aptet.apcfss.in/  వెబ్ సైట్ ను సంద‌ర్శించాల‌ని తెలిపారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: