తారక్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండా ఆవిష్కరణ..

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఆల్ రౌండర్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన తాత రామారావు బాబాయ్ బాలకృష్ణ లాగానే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.రాజకీయాల్లోకి రావాలని నందమూరి అభిమానులు నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించడం జరిగింది. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చూపించారు. తారక్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరిలో చంద్రబాబునాయుడు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారట అభిమానులు.అందుకే తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరగా రావాలని అభిమానులు బాగా కోరుకుంటున్నారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తన తాతగారి లాగే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న పెద్ద మాస్ హీరో.


తన తాత నందమూరి రామారావు పోలికలతో ఉండటం వలన తారక్ అంటే నందమూరి అభిమానులకి పిచ్చి ప్రేమ.ఎంతటివారినైనా తన మాటలతో మెప్పించగలిగే తత్వం కలవాడు తారక్. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.ఇక గతంలోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఆ టైంలో తారక్ ఎనర్జీ ప్రశంసనీయం అనే చెప్పాలి.


తారక్ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలా పని చేస్తానని, ఎప్పుడు తన అవసరం వస్తే అప్పుడు పార్టీకి సేవలండించడానికి సిద్ధం అని గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవసరం ఉందని నందమూరి అభిమానులతో పాటుగా తెలుగు దేశం పార్టీ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.మరి తారక్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో అన్నది చూడాలి.ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: