సంక్షేమం పై సమరమా.. టిడిపి ఇలా చేస్తే బాగుండేదేమో?

praveen
ఇటీవలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ఒక పెద్ద సమరం చేసేందుకు సిద్ధమైనట్లు ఇటీవలే ప్రకటించింది.  ఓ వైపు జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాము అంటూ చెబుతూనే.. ప్రజలకు సంక్షేమం పేరుతో ఇస్తున్న డబ్బులు అన్నీ కూడా మళ్ళీ ఇతర కారణాల చెప్పి లాగేసుకుంటున్నారు అని.. ధరల పెరుగుదల, టాక్స్ ల పేరుతో సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చిన మొత్తాన్ని గుంజుతున్నారు అంటూ ప్రస్తుతం టిడిపి ఆరోపిస్తోంది. అయితే టిడిపి పాయింట్ కరెక్టే కానీ ఆ పాయింట్ లో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

 ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే  ఇక అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ప్రస్తుతం జగన్ పథకాల ద్వారా దాదాపుగా ప్రతి ఏటా ఒక కుటుంబంలో 50 వేల వరకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు.  తద్వారా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం  ఎక్కువగా అవుతుండడం ద్వారా ఇక రాబోయే ఎలక్షన్లలో ప్రజలందరూ ఇంతకంటే ఎక్కువగా ఎవరు ఇస్తారు అనేదే చూస్తున్నారని.. సంక్షేమ పథకాల ద్వారా డబ్బును పొందడం తమ హక్కుగా భావిస్తున్నారని  అంటున్నారు విశ్లేషకులు.

 ఒకవేళ వచ్చే ఎలక్షన్లలో టీడీపీ ఓటర్లను ఆకర్షించాలన్నా.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అందిస్తున్న దానికంటే ఎక్కువ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తామని హామీ ఇస్తే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉందని..  రోజురోజుకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం పెరిగితే ప్రజలు పనులు చేసుకోవడం మానేసి సోమరులుగా మారే అవకాశం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇలాంటి సమయంలో.. టిడిపి ఒక క్లారిటీ తో సంక్షేమంపై సమరం చేస్తే బాగుంటుంది అని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ విషయంలో టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: