తీవ్ర భావోద్వేగానికి గురైన మోడీ..?

Suma Kallamadi
కరోనాతో భారతీయులు పిట్టల్లా రాలిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటిపర్యంతమయ్యారు. కరోనాతో మరణించిన వారిని గుర్తు చేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన వారణాసికి చెందిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో నరేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. అదే సమావేశంలో ఆయన కరోనా తో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


"కాశి సేవకుడిగా.. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, వార్డ్ బాయ్స్, అంబులెన్స్ డ్రైవర్లు ఇంకా ఎవరైతే అహోరాత్రులు అంకితభావంతో పని చేశారో వారందరికీ ధన్యవాదాలు. మనం కరోనా మహమ్మారిని చాలా వరకు కట్టడి చేసాం. కానీ ఇప్పుడే విశ్రాంతి తీసుకో కూడదు.. ఎందుకంటే కరోనా తో ఇంకా సుదీర్ఘ యుద్ధం చేయాల్సి ఉంది. మన దృష్టిని గ్రామాలపై మళ్ళించాలి" అని ఆయన అన్నారు.


కోవిడ్ 19 ఎంతోమంది ప్రియమైన వారిని మన నుంచి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిందని.. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని.. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటిపర్యంతమయ్యారు.


మన వంతు వచ్చినప్పుడు వాక్సినేషన్ తప్పకుండా తీసుకోవాలి. మనమందరం కలిసికట్టుగా పోరాడితే కరోనా ను జయించవచ్చు అని ఆయన అన్నారు. బ్లాక్ ఫంగస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి అని ఆయన అన్నారు. అయితే గ్రామాల్లో కరోనా వైరస్ కట్టడి చేసే విషయంలో ఆశ వర్కర్స్ తో పాటు ఎఎన్ఎమ్ వర్కర్స్ చాలా కృషి చేశారని.. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఆయన అన్నారు.


ఇకపోతే గడిచిన 24 గంటల్లో 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,209 రోగులు మరణించారు. కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. కరోనా మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: