పెళ్లి చేసుకోవాలంటే ఆ రిపోర్ట్ తప్పనిసరి.. లేకుంటే ?

Satvika
కరోనా ప్రబలుతున్న నేపథ్యం లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రోజు రోజుకు లక్షల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మరణాలు కూడా అంతకు మించి నమోదు అవుతున్నాయి. ప్రభుత్వం కూడా కరోనా కట్టడి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. అయిన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి..రెండో దశ కోవిడ్‏ను నియంత్రించడానికి అనేక విధాలుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. దయచేసి ఎవరు బయటకు రాకండి… అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇల్లు దాటండి.. కరోనా జాగ్రత్తలు పాటించండి అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్న కానీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు.

కరోనాను జాగ్రత్తలు పాటించని వారిని కరోనా కబలిస్తుంది. కనీసం చివరి చూపులు కూడా తమ ఆత్మీయులకు దక్కకుండా చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఈ మేరకు లాక్ డౌన్ ను విధించే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు కఠినతరమైన చర్యలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా శుభకార్యాల కు చెక్ పెడుతున్నారు. పెళ్ళిళ్ళు , శుభకార్యాలు అనేవి కొద్ది మందితో చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక అంత్యక్రియలు కూడా కరోనా నిబంధనలు పాటించాలని చెబుతున్నారు..

భువనేశ్వర్‏లోని గంజాం జిల్లా అధికారులు పెళ్లికి రిపోర్ట్ ఉండాలని సూచించారు. కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలనే నిబంధనను ప్రకటించింది. వివాహానికి ముందుకు వరుడు లేదా వధువు తరుపున వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయించుకోకపోతే.. వివాహానికి అనుమతి ఇవ్వబడదని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృతా కులాంగే తెలిపారు. జిల్లా లోని అన్ని బిడిఓలు, తహశీల్దార్లను ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వధూవరులతో సహా 50 మంది పాల్గొనే వారి తో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అనుసరిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: