అక్కడ టీకా వేయించుకుంటే టమాటాలు ఫ్రీ ..

Satvika
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే.. మొదటి సారి వచ్చిన వైరస్ కన్నా ఇప్పుడు వస్తున్న వైరస్ తీవ్రత కంటి రెప్ప పాటులో పెరిగిపోతుంది. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే టీకా పంపిణీని వేగం చేశారు. కాగా, టీకా ను వేయించుకోవడం పై జనాల్లో అపోహలు ఉన్నాయి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో.. చనిపోతారెమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చాలా మంది టీకా వేయించుకొలేదు. అలాంటి వారికి కొన్ని విధాలుగా ఆకర్షించి టీకాను  తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీజాపూర్ కొత్త ఆలోచన చేసింది. టీకా వేయించుకున్న వారికి టమోటాలను ఫ్రీ గా ఇస్తున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా టీకా వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ‌లోని జీజాపూర్‌ పురపాలక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టీకా వేసుకున్న వారందరికీ టమోటాలు ఉచితంగా ఇస్తోంది. కరోనా టీకా తీసుకున్న వారందరికీ టమోటాలను అందిస్తున్నామని బీజాపూర్‌ మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు. టమోటా లకు మంచి డిమాండ్ ఉండటంతో జనాలు టీకా వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు..

ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని.. రైతుల నుంచి టమోటాలు సేకరించి వాటిని టీకా వేసుకున్న వారికి పంచుతున్నామని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 13834 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధికంగా 175 మంది మృత్యు వాత పడగా, ఇప్పటి వరకు మొత్తంగా 6083 మంది మరణించారు. ఈ ఆలోచన తో వ్యాక్సి నేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.. ఇలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో టీకా వేసుకునేందుకు జనాలు ముందుకొచ్చెలా సరికొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు...అయిన కూడా కరోనా సోకుతుండటం తో స్వీయ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: