తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

Satvika
తెలంగాణలో మామూలు రోజుల్లోనే మద్యం విరివిగా దొరుకుతుంది.. ఆయా సర్కారే మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందుబాబులు సమయం సందర్భం లేకుండా తాగుతూ ఊగుతున్నారు.. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే చెప్పనక్కర్లేదు మద్యం ఏరులై పారుతోంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో సాగర్ ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పక్షాలు విందు భోజనాలు, మద్యం సిట్టింగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రాజకీయ పక్షాలు గ్రామాలు, మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ప్రతి గ్రామం లో మూడు ప్రధాన పార్టీల నుంచి ప్రచారంలో పాల్గొంటున్న కనీసం 100 మందికి సాయంత్రం మందు తప్పనిసరి అయింది. కుల పెద్దలు, యువ నేతలకు ప్రత్యేక విందు. నోటిఫికేషన్‌ విడుదలైన మార్చి నెల నుంచి పోలింగ్‌ ఉన్న ఏప్రిల్‌ లో అధికార, విపక్షాల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు కేటాయించిన గ్రామాల్లోనే మకాం వేసి స్థానికంగా ఉండే నేతల తో కలిసి రాజకీయ చర్చలు మొదలు పెట్టారు. అంతేకాదు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు.

గతేడాది మార్చి లో మద్యం విక్రయాల విలువ రూ.7.87 కోట్లే. అంటే గతేడాదితో పోలిస్తే ఇప్పటికే అదనంగా రూ.11.64 కోట్ల విక్రయాలు జరిగాయి. పెద్దవూర, త్రిపురారం, హాలియా, నాగార్జునసాగర్‌, గుర్రంపోడు, తుమ్మడం షాపుల నుంచే మద్యం విక్రయాలు భారీగా సాగుతున్నాయి. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు చూస్తే వరుస సెలవుల వల్ల మద్యం డిపోలు రెండు రోజులే తెరిచి ఉంచారు. ఈ రెండు రోజుల్లోనే నియోజకవర్గంలో 2,557 పెట్టెల లిక్కర్‌, 1572 బీర్ల పెట్టెలు విక్రయం కాగా వాటి విలువ రూ.2.8 కోట్లు. రానున్న వారం రోజుల్లోనే భారీ సభలు, రోడ్‌ షోలు ఉన్నాయి. 17వ తేదీన పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు మరింతగా పెరుగుతాయని దుకాణదారులు చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: