రాజమండ్రి జూనియర్ కాలేజీ హాస్టల్లో కరోనా కలకలం.. ఏకంగా 175 మందికి సోకిన కరోనా...

Purushottham Vinay
కరోనా రోజు రోజుకి తన పంజా విసురుతుంది.ప్రపంచం మొత్తాన్ని నిద్ర లేకుండా ఈ కరోనా అల్లకల్లోలం చేస్తుంది.ఇప్పటికే ఎంతో ప్రాణ నష్టం జరిగి చాలా మంది చనిపోయారు.లాక్ డౌన్ తరువాత కొంచెం కుదుటపడిన పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారయ్యింది. మళ్ళీ కరోనా చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది. భారతదేశంలో కూడా రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో తీవ్రంగా కరోనా ప్రభావం చూపుతుంది. ఇక తెలుగు రాష్ట్రలు అయినా ఆంధ్ర, తెలంగాణా లో కూడా కరోనా కలకలం సృష్టిస్తుంది.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌లో కరోనా కలకలం రేగింది. కాలేజ్ హాస్టల్‌లో మొత్తం 175 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాలేజ్‌ హాస్టల్లోనే ప్రభుత్వ వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్య సేవలను మంత్రి చెల్లుబోయిన వేణు పరిశీలించారు.


ఆ తరువాత మంత్రి మీడియాతో మాట్లాడటం జరిగింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్‌డౌన్ ఎదుర్కోవలసి ఉంటుందని వేణు చెప్పారు.జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ మార్చి మూడోవారం నుంచి అడ్డుఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ అంతకంతకూ కోరలు చాస్తోంది.ఏరోజుకారోజు నమోదవుతోన్న పాజిటివ్‌ల సంఖ్య రెట్టింపవుతోంది.


దీంతో సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్‌ల పరంపర కొనసాగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. మాస్క్‌ ఉంటేనే ఆయా పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలోకి అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. లేకుంటే ఖచ్చితంగా చాలా అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: