ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు.. కానీ అంతలోనే..?
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అప్పటివరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటే చూసి ఆనందపడిన తల్లిదండ్రులు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. మా కొడుకును మాకు తిరిగి ఇవ్వు దేవుడా అంటూ గుండెలు పగిలేలా ఆ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన రాజు దేవిక దంపతులకు రెండేళ్ల కుమారుడు లోకేష్ ఉన్నాడు. అయితే ఇటీవలే మధ్యాహ్నం సమయంలో లోకేష్ ఇంటిముందు ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే ఇక ఇంటి సమీపంలో ఆ బాలుడికి ఒక బంతి దొరికింది. ఇక తెలిసీ తెలియని వయసు కావడంతో ఇక ఆ బంతిని తినడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బంతి కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి గమనించిన బాలుడు తల్లి వెంటనే పరుగులు పెట్టి ఒక బాలుడి నోట్లో నుంచి బంతి తీసేందుకు ప్రయత్నించింది. కానీ లాభం లేకుండా పోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఒక బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.