కామాతురాణం.. న భయం.. న లజ్జ.. అంటారు. తమిళనాడులోనూ అదే జరిగింది. మద పిచ్చి పట్టిన ఇద్దరు మగాళ్లు అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంపై బడి.. 50 మంది వరకూ రేప్ చేసిన ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు కామాంధులు ఓ పథకం ప్రకారం సాగించిన ఈ కీచకపర్వంపై అక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
డిటైల్స్ లోకి వెళ్తే.. కరక్కూడి ప్రాంతానికి చెందిన సత్యన్, అర్జునన్ అనే ఈ ఇద్దరు కామాంధులు.. కూడబలుక్కుని ఈ సీరియల్ రేప్స్ కు తెర తీశారు. ముందుగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండే లేడీస్ ను సెలక్ట్ చేసుకునేవారు. వాళ్లను బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా లొంగదీసుకుని.. బంధించి దాదాపు నెలరోజులపాటు ఇద్దరూ అనుభవించేవారట.
నెలరోజుల తర్వాత మళ్లీ సేమ్ సీన్.. ఇలా నెలకో ఇద్దరి చొప్పున.. దాదాపు నాలుగేళ్లపాటు ఈ కీచకపర్వం కొనసాగించారు. ఇప్పటి వరకూ దాదాపు 50 మంది వరకూ బాధితులను పోలీసులు గుర్తించారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఇద్దరు దుర్మార్గులను పట్టుకోవడం అంత ఈజీగా ఏం జరగలేదట. ఓ పెద్ద టీమ్ ఈ ఇష్యూపై పరిశోధన చేస్తే గానీ దొరకలేదట. చాలా తెలివిగా సీసీటీవీలకూ, చెక్ పోస్టులకూ దొరక్కుండా తప్పించుకున్న ఈ దుర్మార్గులను వాళ్ల మోటార్ బైకే పట్టించిందట. దాని గుర్తుల ఆధారంగా మొత్తానికి ఈ కామాంధులను పట్టుకున్నారట.