ముంబయి విద్యుత్ కాంట్రాక్ట్ ఖతార్ కు అప్పగించిన అదానీ.. మోడీ పై విమర్శలు..?
అదే అంబానీ ఇప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. తాజాగా తన అదానీ టాన్స్‌మిషన్ సంస్థలో పావు వంతు వాటాని అదానీ ఖతార్ సంస్థకు అమ్మేశాడు. దీంతో ఇప్పుడు ముంబయిలోని కీలకమైన విద్యుత్ ట్రాన్స్ మిషన్ బాధ్యతలు ఖతార్ సంస్థ చేతికి వెళ్లిపోయాయి. ఈ డీల్‌లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. మరి ఇలా ఖతార్ చేతికి అప్పగించడం ఆత్మ నిర్భర్ భారత్ ఎలా అవుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
మోడీ ఇలాంటి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక అదానీ విషయానికి వస్తే.. ఆయన ప్రపంచ కుబేరులైన ఎలాన్ మస్క్, బెన్ జోయిస్ లను సైతం తలదన్నేలా సంపాదన ఆర్జిస్తూ ఓ ఇండియన్ బిజినెస్‌మెన్ ప్రపంచ వార్తల్లోకి ఎక్కేశాడు. దేశంలో సంపన్ను ఆస్తులపై సర్వే నిర్వహించే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర దూసుకెళ్లడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది.
అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్, పవర్ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్‌ప్రైజెస్ ముందుకొచ్చింది. అంటే సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్ అడుగుపెట్టిందన్నమాట. ఈ ఒక్క ఏడాదిలో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 శాతం మేర పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 90%, అదానీ ట్రాన్స్‌మిషన్ 79% మేర దూసుకెళ్లాయి. ఇక అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లిమిటెడ్ వంటి కంపెనీల షేర్లు 52% మేర రాణించాయి.