క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఇలా చేస్తే బోలెడన్ని లాభాలు..?

praveen
ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం ఎంతలా  పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అప్పట్లో కొంతమంది మాత్రమే క్రెడిట్ కార్డు వినియోగించే వారు కానీ ప్రస్తుతం మాత్రం సామాన్య ప్రజలు కూడా క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వద్దు వద్దు అన్న కూడా క్రెడిట్ కార్డు అందించేందుకు సిద్ధమవుతున్నాయి ఆయా బ్యాంకులు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే క్రెడిట్ కార్డ్ అయితే వినియోగిస్తున్నారు కానీ క్రెడిట్ కార్డ్ ని ఎలా వినియోగిస్తే ఎక్కువగా లాభాలు పొందవచ్చు అన్నది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

 క్రెడిట్ కార్డు తీసుకున్న కొత్తలో బ్యాంకులు తక్కువ క్రెడిట్ లిమిట్ తో మాత్రమే  జారీ చేస్తాయి.  ఇక ఆ తర్వాత సకాలంలో చెల్లింపులు జరుపుతున్నారా లేదా అనే అంశాలను పరిశీలించి క్రెడిట్ లిమిట్ ను పెంచుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఇలా క్రెడిట్ లిమిట్ పెంచుతామని సంస్థలు చెప్పినప్పటికీ అప్పుల భారం ఎక్కువ అవుతుందేమోనని భయంతో ఎవరు పెంచుకోవడానికి ఇష్టపడరు. క్రెడిట్ స్కోర్ లెక్కింపు సమయంలో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను పరిగణలోకి తీసుకుంటారు. అందుకే సియుఆర్ 30 శాతం లోపే ఉంచుకోవడం ఎంతో మంచిది. తద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది.


 అయితే మీకు అవసరమైన సమయంలో మీ క్రెడిట్ కార్డు లిమిట్ ను సంస్థ పెంచడానికి నిరాకరిస్తే వేరొక క్రెడిట్ కార్డు తీసుకోవడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ బిల్లు చెల్లించే సమయం లోపు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఎమ్ఐ రూపంలో మార్చుకుని  వాయిదాలు కూడా చెల్లించవచ్చు. అంతేకాదు క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండడం వల్ల క్రెడిట్ కార్డ్ పై ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే మెరుగైన రుణ చరిత్ర ఉన్న హోల్డర్లకు మాత్రమే ఇలాంటి రుణాలను అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న రోజే మీ బ్యాంకు ఖాతాలోకి ఇలా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: