రామ్ చరణ్ కి తల్లి పాత్రలో టాలీవుడ్ సీనియర్ స్టార్ నటి..?

MADDIBOINA AJAY KUMAR
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు నెలల్లో వీలు కాకపోతే కనీసం ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అయినా విడుదల చేయాలి అని మేకర్స్ గట్టి పట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి.

ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ , చరణ్ కి జోడిగా కనిపించనుండగా ... శివరాజ్ కుమార్ ఈ మూవీ లో ఒంకిలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా మదర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిపోతున్నట్లు , అందుకోసం చరణ్ తల్లి పాత్రలో ఈ మూవీ లో విజయశాంతి ని తీసుకోవాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈమెకు మరికొన్ని రోజుల్లోనే కలిసి కథను వినిపించనున్నట్లు , ఈమెకు గనుక కథ నచ్చి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆర్ సి 16 మూవీ లో రామ్ చరణ్ కు తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: