టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!

Chakravarthi Kalyan
కరోనా కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలు కష్టాలకు చిరునామాగా మారాయి. ఒక్క తెలంగాణలోనే బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో రెండున్నర లక్షల మంది ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు రెండు లక్షల మంది టీచర్లు లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నాలుగు వేలకుపైగా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 70 వేల మంది టీచర్లున్నారు. ఇప్పుడు వీరిలో 50 వేల మంది దాకా ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది.

వీరు కాకుండా మరో 20 వేలమంది టీచర్లు నైన్త్, టెన్త్ క్లాసులకు పాఠాలు చెప్తున్నారు. స్కూళ్ల మేనేజ్మెంట్లు ఈ 20 వేల మందికి కూడా సగం జీతాలే చెల్లిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు గంటల లెక్కల జీతాలిస్తూ దోచుకుంటున్నాయి. వింత పద్దతుల్లో పని చేయించుకుంటున్నాయి. పాఠశాలలు తెరుచుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించిన ప్రైవేటు టీచర్లలు నిరాశే ఎదురైంది.

స్కూళ్లు తెరుచుకున్నా.. చాలా మేనేజ్మెంట్లు టీచర్లకు పూర్తి జీతాలు ఇవ్వడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో రోజంతా పని చేయించుకుని కూడా సగం జీతం మాత్రమే ఇస్తున్నారు. మొత్తం మీద ప్రైవేటు ఉపాధ్యాయుల్లో పదో వంతు కూడా ఫుల్ శాలరీలు తీసుకోవడం లేదు.. అంటే 90 శాతం మంది  జీతాలకు కటకటలాడుతున్నారన్నమాట. మామూలు రోజుల్లో ఉపాధ్యాయుల కష్టంతో లక్షలకు లక్షలు పోగేసుకున్న ప్రైవేటు పాఠశాలలు.. కష్టకాలంలో వీరిని ఆదుకోవడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు టీచర్లందరి పరిస్థితి ఇలాగే ఉంది.


లాక్‌‌ డౌన్‌‌లో 85.7 శాతం మంది టీచర్లకు ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. పూర్తిగా జీరో ఇన్‌‌ కంతో జీవితాలు వెళ్లదీశారు. కేవలం 14.3 శాతం మంది టీచర్లకు మాత్రమే కొంతవరకు ఆదాయం లభించిందని సర్వేలు చెబుతున్నాయి. అయితే అన్‌‌లాక్‌‌ తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు లేవు. స్కూళ్లు తెరిచినా 62 శాతం మంది టీచర్లకు ఉద్యోగాలు లేని పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: