ఏబీఎన్‌ శపథం: ఒక్కరోజులోనే మాట తప్పావేమి.. వెంకటకృష్ణా..?

Chakravarthi Kalyan
వెంకటకృష్ణ.. సీనియర్ జర్నలిస్టు.. ఈటీవీతో మొదలుపెట్టి.. ఆ తర్వాత టీవీ5లోనూ.. ప్రస్తుతం  ఏబీఎన్‌లోనూ పని చేస్తున్నారు. డిస్కషన్లు నిర్వహించడంలో దిట్ట. చర్చల్లో తనదైన మార్కు చూపిస్తూ ఈ మధ్య ఆంధ్రా ఆర్ణబ్‌ గానూ పేరు తెచ్చుకున్నారు. అయితే.. తాజాగా ఆయన ఓ డిబేట్‌లో ఇచ్చిన మాటను ఒక్కరోజులోనే తప్పి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
మొన్న ఏపీ ప్రభుత్వ తాజా కేబినెట్ మీటింగ్ లో అమరావతి గురించి తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మొన్న ఏబీఎన్‌ ఛానల్‌ లో చర్చ జరిగింది. ఈ డిబేట్‌లో  బీజేపీ నేత‌.. విష్ణువ‌ర్ధన్ రెడ్డిపై  ఏపీ ప‌రిర‌క్షణ స‌మితి అధ్యక్షుడు కొటిక‌లపూడి శ్రీనివాస్ చెప్పు విసిరారు. చర్చలో భాగంగా రాజ‌ధాని నిర్మాణానికి బీజేపీ చేసింది ఏమీ లేద‌ని కొటిక‌లపూడి మొదట విమ‌ర్శించారు. దీనికి విష్ణువ‌ర్ధన్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ఈ సమయంలో నువ్వు టీడీపీ ఏజెంట్‌గా మాట్లాడుతున్నావు. ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని ఎత్తేసి.. పార్టీలో చేరిపో అంటూ.. విష్ణువ‌ర్ధన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొటిక‌ల‌పూడి శ్రీనివాస్ సంయ‌మ‌నం కోల్పోయి.. కాలి చెప్పుతో ప‌క్కనే కూర్చున్న విష్ణువ‌ర్ధన్‌ రెడ్డిపై చెప్పు విసిరారు. చెప్పు విష్ణువ‌ర్ధన్‌ రెడ్డి కుడి భుజానికి చెప్పు త‌గిలి కింద‌ప‌డింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. క్షణాల్లో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ హఠాత్మరిణామంతో షాకైన యాంకర్ వెంకట కృష్ణ వెంటనే డిస్కషన్‌లో బ్రేక్‌ చెప్పేశారు. ఆ బ్రేక్ సమయంలోనే కొటికలపూడి శ్రీనివాస్‌ ను డిస్కషన్ నుంచి పంపించి వేశారు.
ఆ తర్వాత జరిగిన పరిణామంపై వెంకటకృష్ణ విష్ణువర్థన్ రెడ్డికి సారీ చెప్పారు. అంతే కాదు.. ఇకపై తన డిష్కషన్లకు కొటిక‌ల‌పూడి శ్రీనివాస్ ను జీవితంలో పిలవనని శపథం చేశారు. అబ్బో.. వెంకటకృష్ణ సరైన నిర్ణయమే తీసుకున్నారని అంతా అనుకున్నారు. అయితే.. విచిత్రంగా మరుసటి రోజే.. వెంకటకృష్ణ సదరు కొటికలపూడి శ్రీనివాస్‌ను స్టూడియోకు పిలిచి.. ఈ పరిణామంపై మరోసారి చర్చ నిర్వహించడం వివాదాస్పదమైంది. ఇకపై తన డిష్కషన్లకు కొటిక‌ల‌పూడి శ్రీనివాస్ ను జీవితంలో పిలవనని శపథం చేసిన వెంకటకృష్ణ.. మరీ ఒక్కరోజులోనే మాట మార్చడం విమర్శలకు దారి తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: