తెలుసా..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరు ఎంతమందికైనా ఓటేయొచ్చు ?

Chakravarthi Kalyan
ఓటు వేయడం ఏముంది.. నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటేయడమే కదా అనుకుంటారు చాలా మంది. కానీ పట్టభద్రలు ఎమ్మెల్సీ ఓటు లెక్క వేరు.. అందుకే పట్టభద్రులూ... ఆలోచించి ఓటు వేయండి.. ఎమ్మెల్సీ ఎన్నికలు వేరు, ఎమ్మెల్యే ఎన్నికలు వేరు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు అంటే తెలుసుకోండి. ప్రస్తుతం జరగనున్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ – మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రులఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్లలో ఆలోచించి ఓటు వేయాలి.
ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే ,ఎంపీ ఎన్నికలు వేరువేరు.. స్థానిక సంస్థలు అనగా సర్పంచ్, ఎంపిటిసి, ఎంపీపీ, జడ్పిటిసి, వార్డ్ మెంబర్ ఎన్నికలు వేరు.. స్థానిక సంస్థల ఎన్నికలలో అనగా సర్పంచ్ ,ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లో ,అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో  ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ను వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ,ఎం.పి.టి.సి జెడ్.పి.టి.సిలను ఎన్నుకొనే ఎన్నికలలో మనం మనకు నచ్చిన అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తాం, అది కేవలం ఆ అభ్యర్థికే కాకుండా మరొకరికి వేస్తే.. అది చెల్లు బాటు కాకుండా పోతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం ఓటు వేసే ప్రక్రియ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మనం మనకు కావలసిన అభ్యర్ధికి మాత్రమే కాకుండా మరొకరికి కూడా ఓటూ వేయవచ్చు. పోటీలో ఎంతమంది ఉంటే అంత మందికి ఓటు వేయవచ్చు. ఇలాంటి విధానంలో మన ఓటు ఎవరికి ఎలా వేసుకోవాలి? మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలంటే? (1) మొదటి ప్రాధాన్యత ఓటు అంటే, మనకు నచ్చిన అభ్యర్థికి మొదట ఓటు వేయడం... ఇంకో  అభ్యర్థికి 2   (నెంబరు/number) ఓటు వేయవచ్చు.
ఇంకో అభ్యర్థికికి 3 (నెంబరు) ప్రాధాన్యత ఓటు వేయవచ్చు. 20 మందీ బరిలో ఉంటే, వరుసగా ... వారి పేర్లు ఉండగా, మనకు నచ్చిన అభ్యర్ధి , వరుసలో పేరు పక్కన / బ్యాలెట్ పేపర్ లో నిర్దేశించబడిన  స్థలంలో ఓటు వేయవచ్చు... 20 మంది 30 మంది అభ్యర్థులు ఉన్నాసరే, ఉదాహరణకు వరుసలో నెంబర్ 12 లో ఉంటే అక్కడ  నెంబర్  1 వేస్తే, అది. మొదటి ప్రాధాన్యత ఓటు అన్నమాట. ఇ లా వరుసగా 30 మందికి కూడా ఓటు వేయవచ్చు.. 50 శాతం ఓట్లు ఎవరికి వస్తే  ఎవరికి వస్తే వారు గెలిచినట్లు లెక్క. మొదటి "1"ప్రాధాన్యత ఓట్లు 50% రాకపోతే  "2" ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు .. అక్కడ 50 శాతం రాకపోతే మళ్లీ "3"  ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు... ఇలా 50 శాతం ఓట్లు  వచ్చేవరకు లెక్కిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: