వైసీపీ లోకి దివ్యవాని...టీడీపీ ఇంటర్నల్ పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్.!

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ హీరోయిన్ దివ్యవాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లో అధినేత చంద్రబాబు తో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు ఎదురుకొంటున్నట్టు స్పష్టం చేశారు. టీడీపీ లో ఎందుకు ఇబ్బందులు కొనసాగుతున్నారని..వైసీపీ ఇతర పార్టీలనుండి ఆఫర్లు రావడం లేదా అని  ప్రశ్నించగా...దేనికైనా టైమ్ రావాలని సమాధానం ఇచ్చారు. తొందరపడటం దేనికని దేనికైనా టైమ్ రావాలని తనకు తొందర పడటం ఇష్టం లేదని చెప్పారు. తాను 15 ఏళ్ల నుండి సినిమాలోకి వెళ్లినట్టు దివ్యవాని వెల్లడించారు. సినిమాల్లో ఉన్నప్పుడు కూడా తన పై ఎలాంటి రిమార్కు.. లేవని అన్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరవాత పరిస్థితులు వేరేలా ఉన్నాయని చెప్పారు. తాను సమస్య పై కచ్చితంగా మాట్లాడతానని..తప్పు ఉంటే విమర్శించవచ్చని చెప్పారు. కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మాత్రం దారుణమని అన్నారు. వాళ్ళ అమాయకత్వం చూస్తుంటే బాధేస్తుందని ఇలాంటి సమయంలో వేరే పార్టీలోకి వెళ్లడం పెద్ద సమస్య కాదని అన్నారు.
తాను పాలిటిక్స్ లోకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదని..ఇంతమంచి నాయకుడు చంద్రబాబు దగ్గర పనిచేస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇంటర్నల్ పాలిటిక్స్ పై చంద్రబాబు లేఖ రాసినట్టు దివ్యవాని వెల్లడించారు. సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్నీ బయట పెడతానని చెప్పారు. తాను ఎప్పుడూ సీటు కోసం దొంగ వేషాలు వేయలేదని..బాబు గారిని అడగలేదని అన్నారు. అధికార ప్రతినిధి ఇచ్చారు..అధికార ప్రతినిధి అంటే గైడెన్స్ ఇవ్వాలి. కానీ ఇవ్వరని అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను చంద్రబాబు ను చూసే టీడీపీ లో చేరానని కానీ మహిళలకు పెద్ద పీట అనేది వట్టిదేనని చెప్పారు. సోనియాగాంధీ, ఇందిరాగాంధీ, పురంధేశ్వరి లాంటి వాళ్ళకి బ్యాగ్రౌండ్ ఉంది కానీ జయలలిత లాంటి వాళ్లు చాలా కష్టపడ్డారని అన్నారు. ఇదిలా ఉండగా గతంలో పార్టీ మారటం పై ప్రశ్నించినప్పుడు..ఆ వార్తలను ఖండించిన దివ్యవాని ఇప్పుడు ఇలా మాట్లాడటం అనుమానాలకు దారితీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: