షాకింగ్ : అఖిలప్రియ భర్త మిస్టరీ.. పోలీసుల వింత ప్రవర్తన..?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు ఘటన పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిక్కుముడులు మొదటే విడిపోయాయి. అఖిల ప్రియ ఆధ్వర్యంలోనే ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ప్రమేయంతో కిడ్నాప్ జరిగిందని పోలీసులు మీడియాకు ఆధారాలతో చూపించారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అఖిలప్రియ బెయిల్ పై కూడా విడుదలైంది.. కానీ.. ఎప్పుడో నెలరోజుల క్రితమే చిక్కుముడి వీడినా ఇప్పటికీ పోలీసులు అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ను పట్టుకోలేకపోయారు.
 
అయితే అఖిల ప్రియ భర్తను పోలీసులు పట్టుకోకపోవడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.. పోలీసుల్లో వచ్చిన విబేధాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల్లోని సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయట. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ అనంతరం నిందితులను పట్టుకున్నప్పుడు తామే అంతా చేశామంటూ రెండు ప్రత్యేక బృందాల్లో సభ్యులు ఉన్నతాధికారులకు చెప్పుకొని అభినందనలు అందుకున్నారు.
ఆ తర్వాత ఏమైందంటే.. అఖిల ప్రియ ఆచూకీతో సహా ఆమె అనుచరులు ఎక్కడున్నారన్న విషయాన్ని తెలుసుకుని పట్టుకున్నామని, పేరు మాత్రం వేరే బృందాల వారికి వచ్చిందని మరో బృందం సభ్యులు ఫీలయ్యారట. దీంతో అప్పటి నుంచి ఇతర నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు సమాచారం సేకరిస్తున్నా...పరస్పరం సహకరించుకోవడం లేదట. దీంతో భార్గవ్‌ రామ్‌ ఎక్కడున్నది గుర్తించడంలో.. పట్టుకోవడంలో ఆలస్యం జరుగుతోందట.
మొత్తానికి పోలీసుల విబేధాలతో.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో పోలీసులు క్రమంగా పట్టు కోల్పోతున్నారు. నిందితులందరినీ నాలుగైదు రోజుల్లో అరెస్టు చేస్తామంటూ పోలీస్‌ ఉన్నతాధికారులు మొదట్లో ప్రకటించారు. ఈ కేసులో ప్రథమ ముద్దాయి మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె ఆదేశాలను పాటించిన వారిని మినహా సూత్రధారులు భార్గవరామ్, గుంటూరు శ్రీను, పాత్రధారులైన భార్గవరామ్‌ తల్లి కిరణ్మయి, భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిలను పోలీసులు ఇంతవరకూ పట్టుకోలేనేదు. మరి ఈ కేసులో పోలీసులు ఎప్పుడు విజయం సాధిస్తారో..? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: