కేసీఆర్ ఇప్పటికే ఆ ఎన్నో సార్లు చెప్పారు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

praveen
తెలంగాణ రాష్ట్రం లో ఎన్నో రోజుల నుంచి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీ ఎంతో వ్యూహాత్మకం గా అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎంపిక  అయిన నాటి నుంచి కూడా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్నది.  ఈ క్రమం లోనే తెలంగాణ ప్రభుత్వం తీరును  ప్రజల్లోకి తీసుకెళ్లడం లో విజయం సాధిస్తున్నది  అన్న విషయం తెలిసిందే.  అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి మరిచి పోయిన హామీలను తెర మీదికి తెచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తున్నది.

 తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న వరుస ఎన్నికలు ఒకసారి అవకాశం గా మారి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా  ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో వినియోగించుకున్న బీజేపీ పార్టీ.. తెలంగాణలో క్రమక్రమంగా బలపడుతుంది. టిఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి దుబ్బాకలో ఘనవిజయాన్ని సాధించింది బిజెపి పార్టీ. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి  షాక్ ఇచ్చిన  విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై కూడా కన్నేసింది.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.  మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకు పడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఒకవేళ  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అంటూ కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు అంటూ విమర్శించారు బండి సంజయ్. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు అందించలేదని అంతే కాకుండా ఇక ఆ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా టిఆర్ఎస్ ఏమీ చేయలేదు అంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: