అదిరే ఛాన్స్ : టెన్త్‌తోనే పోస్టల్‌ జాబ్‌.. పరీక్ష కూడా రాసేపని లేదు..!?

Chakravarthi Kalyan
నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం పదో తరగతితోనే సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్ అందుకునే అవకాశం వచ్చింది. అది కూడా పరీక్ష రాయకుండానే.. ఇంటర్వ్యూకూ హాజరు కానవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 3446 గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ప్రకటన ద్వారా బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఏపీలో 2296, తెలంగాణలో 1150 పోస్టులున్నాయి.



వివరాల్లోకి వెళ్తే.. ఎంపికైన పోస్టు, సేవల వ్యవధి అనుసరించి వీరికి కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.14,500 ప్రతి నెలా చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  పనిగంటల ప్రకారం వీరికి వేతనాలు ఉంటాయి. కొన్ని శాఖలకు రోజుకి 4 గంటలు, మరికొన్ని శాఖలకు 5 గంటల పని వ్యవధిని నిర్దేశించారు. అందువల్ల ఎంపికైన బ్రాంచ్‌ బట్టి వేతనం మారుతుంది. రోజుకి 4 గంటలు చొప్పున సేవలు అందించే కార్యాలయానికి బీపీఎంగా ఎంపికైతే రూ.12 వేలు, అదే 5 గంటలు సేవలు అందించే శాఖలో విధులు నిర్వహిస్తే రూ.14,500 పొందుతారు. ఏబీపీఎం/డాక్‌ సేవక్‌ పోస్టులకు ఎంపికైనవారు 4 గంటల సేవలకు గాను రూ.పదివేలు, 5 గంటలకైతే రూ.12,000 అందుకుంటారు.



ఈ జీతానికి అదనంగా ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో అందిస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, పని సమయాలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, గరిష్ఠంగా 20 ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 26. https:appost.in/gdsonline/Home.aspx ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: