తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచిత నీటి సరఫరా.. కేసిఆర్ కీలక నిర్ణయం..
హైదరాబాద్ నగరవాసులు అందరికీ కూడా 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ఎలాంటి రుసుము వసూలు చేయకుండా నీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలు మంచి మెజారిటీ సాధించి విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది అన్న విషయం తెలిసిందే.. అయితే మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక ఇప్పుడు సరికొత్త పథకాలను ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం.
గతంలో హామీ ఇచ్చి మరచిపోయిన కొన్ని హామీలను కూడా తెర మీదికి వచ్చి వాటిని అమలు చేసే విధంగా ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పుడు కొత్త హామీలను కూడా తెరమీదికి తెచ్చి ప్రజలందరిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో 142 నగరాలు, పట్టణాల్లో ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రస్తుతం ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
అయితే రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని టిఆర్ఎస్ మానిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల. కొత్తూరు మున్సిపాలిటీలను కూడా ఈ పథకం కోసం ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మే లేదా జూన్ నెలలో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది అని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో అధికార పార్టీలో చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెర మీదికి తెచ్చిన కొన్ని హామీల విషయంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఇక ఈ కొత్త పథకాన్ని తెరమీదికి తీస్తే ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.