రాజకీయ నేతలకు గట్టి షాక్ ఇచ్చిన కర్నూలు జిల్లా వాసులు....
ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కర్నూల్లోని కొడువూరు పరిధిలోని పూడూరి గ్రామంలో ప్రజలు ఒక నినాదం చెయ్యటం జరిగింది. అక్కడ 25 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉందట.ఆ రోడ్డుని బాగు చేయించే నాథుడే లేడంట. అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం దేనికని గ్రామస్థులు రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చారట. ఆ రోడ్డు వల్ల ఇప్పటికి 7మంది గర్భిణీ స్త్రీలు దారిలోనే పురిటి నొప్పులకి ప్రసవం చేసి మరణించడం జరిగిందట. అంత దారుణం అంటే అర్ధం చేసుకోవచ్చు ఆ రోడ్డు ఎలాంటిదో. ఆ ఊరిలో దాదాపు 2000 మంది జనాభా వున్నారు ఇంకా 913 మంది ఓటర్లు కూడా వున్నారు.ఇక తాము ఎవ్వరికి ఓట్లు వెయ్యమని మాకు మా గ్రామానికి ఎన్నికలే వద్దని నినాదాలు చేస్తున్నారట. ఊరంతా దండోరా కూడా వేయించారట.ఈ విధంగా ఆ జనాలు రాజకీయ నాయకులకు గట్టి షాక్ ఇచ్చారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తల గురించి తెలుసుకోండి...