గర్భిణీలు.. ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?
కానీ కొన్ని పండ్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు వైద్య నిపుణులు. గర్భిణీలు నిర్లక్ష్యంగా ఉండి కొన్ని రకాల పండ్లు తింటే చివరికి ప్రమాదానికి దారితీస్తాయి అని చెబుతున్నారు. గర్భిణీలకు కొన్ని రకాల ఫ్రూట్స్ చాలా హెల్దీ అయినప్పటికీ.. గర్భందాల్చిన సమయంలో మహిళలు తినకూడని పండ్లు కూడా కొన్ని ఉన్నాయి అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇక గర్భిణీ స్త్రీలు తినకూడని పండ్లు ఏంటో తెలుసుకుందాం.
చింతపండు : సాధారణంగా చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే చింతపండు ఎక్కువగా తింటే అందులో ఉండే విటమిన్-సి వల్ల గర్భస్రావానికి కారణం అయ్యే ప్రొజెస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది అని అంటున్నారు నిపుణులు.
బొప్పాయి : గర్భం దాల్చక ముందు బొప్పాయి తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు అన్న విషయం తెలిసిందే. గర్భం దాల్చిన తర్వాత పిండం అభివృద్ధికి బొప్పాయి ఆటంకం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
పైనాపిల్ : పైనాపిల్ తినడం వల్ల గర్భాశయ సంకోచాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందుకే గర్భంతో ఉన్న మహిళలు దూరంగా ఉండటమే బెటర్ అని అంటున్నారు.
పుచ్చకాయ : పుచ్చకాయ తినడం వల్ల అందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలోని గ్లూకోజ్ ను అమాంతం పెంచే అవకాశం ఉంది.
అరటిపండు : గర్భంతో ఉన్న మహిళలు అరటిపండు తినడం కారణంగా పలు రకాల అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.