ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఆ నాలుగు రోజుల్లో ఏకంగా 50 శాతం తగ్గింపు..!?
ఇక ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్ ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నాలుగు రోజుల్లో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయని బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. ఇక ఓయో ద్వారా రూమ్స్ బుకింగ్‌పై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లైట్ బుకింగ్‌పై 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. యాత్రా.కామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్యాబ్లెట్స్, వాచ్‌లు, శాంసంగ్ మొబైల్స్‌పై 15 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. పెప్పర్‌ఫ్రై ద్వారా ఫర్నీచర్ కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.
ఇంకా అమెజాన్‌లో పలు కేటగిరిపై కూడా తగ్గింపు అందుబాటులో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ వాలెంటైన్స్ డేకు వారం ముందు ఆఫర్లు ప్రకటించడం విశేషం. ఇంకా ఓయో రూమ్స్‌పై 50 శాతం ఆఫర్ ఉండటం గమనార్హం. ఎస్‌బీఐకి 3.45 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఎస్‌బీఐ కస్టమర్లు కేవలం యోనో ద్వారానే ఈ ఆఫర్లు సొంతం చేసుకోగలరు. యోనో ద్వారా షాపింగ్ చేస్తేనే ఈ బెనిఫిట్ లభిస్తాయి. దీని కోసం ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ ఆర్డర్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫ్యాషన్ అండ్ లైఫ్‌లైఫ్‌లోకి వెళ్లాలి. మీకు నచ్చిన ఆఫర్ పొందొచ్చునాని తెలిపారు.