ఫోన్ చేసి విసిగించిన భార్య.. ఇంటికొచ్చి ట్విస్ట్ ఇచ్చిన భర్త..?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చి స్థానికం గా కలకలం సృష్టించింది. ఇంటికి రావాలి అంటూ భార్య ఫోన్ చేసి విసిగించింది. ఊరికే ఫోన్ చేయడం తో విసిగి పోయిన భర్త కోపంతో ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న రాడ్ తో భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో చివరికి భార్య తీవ్ర గాయాలపాలైన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. టోపీ ఖాన్, చంద్రకళ దంపతులు రుద్రంపేట లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇటీవలే రాత్రి సమయంలో భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చంద్రకళ తరచూ ఫోన్ చేసి భర్తను విసిగించింది.
కొద్దిసేపటి తర్వాత తప్ప తాగి ఇంటికి వచ్చిన భర్త భార్య కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఫోన్ లో అంతలా విసిగిస్తావా అంటూ చిర్రెత్తి పోయాడు. ఇక ఇంట్లో ఉన్న ఓ ఇనుప రాడ్ తో భార్యపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన భార్య స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుని అరెస్టు చేశారు.ఇక ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నందుకు ఇలా దాడి చేయడంతో అందరూ అవాక్కయ్యారు.