వీళ్లు సింగపూర్, జపాన్.. ఆయన దుబాయ్..

Chakravarthi Kalyan
                                       స్పర్థయా వర్థతే విద్యా.. అన్నారు పెద్దలు. అంటే పోటీ ఉంటేనే విద్య రాణించగలుగుతాము అని.. అది ఏ విద్య ఐనా పోటీ ఉంటే ఆ మజాయే వేరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాలనలో, అభివృద్ధిలో పోటీపడుతున్నారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు చుట్టి వచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆ దేశాల పారిశ్రామిక వేత్తలను కలిసి విజ్ఞప్తి చేశారు.                               మేమేం తక్కువ తిన్నామా అనుకున్నారో.. లేక మనం కూడా విదేశీ పెట్టుబడులు సాధిద్దామనుకున్నారో.. తెలియదు కానీ.. తెలంగాణ ప్రభుత్వాధినేతలు కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు.. దుబాయ్ బాట పట్టారు. తెలంగాణ అధికారులను వెంటబెట్టుకుని గల్ఫ్ బాట పట్టారు. అక్కడ ఫిక్కీ ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని వివరించారు.                                    పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న పారిశ్రామిక విధానం ప్రకటించిందని అక్కడి పారిశ్రామిక వేత్తలకు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వారికి ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతోందని తెలిపారు. పరిశ్రమల కోసం భారీ భూబ్యాంకు ఏర్పాటు చేశామని.. సమగ్ర ప్రతిపాదనలతో వస్తే.. వెంటనే భూకేటాయింపులు, అనుమతులు మంజారు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిచూపించారట. పనిలో పనిగా కేటీఆర్.. అక్కడి స్మార్ట్ సిటీ వ్యవస్థ గురించి అడిగితెలుసుకున్నారు. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా చేసేందుకు ఉన్న అవకాశాలను కేటీఆర్ పరిశీలించారు. ఈ పర్యటనతో కేటీఆర్ ఎన్ని పెట్టుబడులు ఆకర్షిస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: