మాజీ సీఎం ఆరోగ్యం అత్యంత విషమం..

Deekshitha Reddy
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. లాలూ ప్రసాద్ చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు దాదాపుగా 75శాతం చెడిపోయాయి. దీనికితోడు, షుగర్, బీపీ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. 72ఏళ్ల వయసున్న లాలూకి వయోభారంతోపాటు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

లాలూ ఆరోగ్యం విషమించిందని తెలియడంతో.. బీహార్ ప్రతిపక్ష నేత లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ భార్య రబ్రీదేవి ప్రత్యేక విమానంలో పాట్నానుంచి రాంచీ వెళ్లారు. లాలూ ప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఎప్పుడైనా విషమించవచ్చని వైద్యులు తెలిపారు. అయితే ఆయనను మరో ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. డయాబెటిస్ కారణంగా అవయవాలు దెబ్బతిన్న వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎలాంటి మందులు లేవని వైద్యులు తెలిపారు.

డిసెంబర్ 2017న prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ కు పశు దాణా కేసులో ఏడేళ్ల శిక్ష పడింది. దీంతో ఖైదీగానే ఆయన.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రెండేళ్ల క్రితం ఆగస్టు 30, 2018న prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణంగా రిమ్స్‌ లో చేరారు. పశుదాణా కుంభకోణంతోపాటు.. ఇతర కేసుల్లో కూడా ఆయనకు జైలు శిక్ష పడింది. గత అక్టోబర్‌లో లాలూకు చైబాసా ట్రెజరీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. దమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. 1991 నుంచి 1996 మధ్య కాలంలో లాలూ సీఎంగా ఉన్న సమయంలో దమ్కా ట్రెజరీ నుంచి రూ. 3.5 కోట్లు అక్రమంగా డ్రా చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు శిక్ష పడింది.
కొవిడ్ నెగెటివ్..
మరోవైపు లాలూకి నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లో కోవిడ్ నెగెటివ్‌గా వచ్చింది.. నమూనాలను సేకరించి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌కు పంపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: