వైసీపీ నేతలకు ఆ విషయంలో భయమా..? ధీమా.?

praveen
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో దూకుడుగా వ్యవహరిస్తోంది..  ఇక అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంది.. ఇక సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది..  జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి.. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఇవన్నీ అధికార పార్టీకి చెందిన నేతలు చెబుతున్న మాటలు. కానీ వాస్తవం విషయానికి వస్తే మాత్రం అంత సీన్ రివర్స్ గా ఉంది. రాష్ట్రంలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచి పోతుంది కానీ ఇప్పటివరకు ఎక్కడ అభివృద్ధి ముందుకు కదలలేదు.

 ఏ ప్రాంతంలో చూసిన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రాజకీయ విమర్శలు చేయడంలో వైసీపీ ఎమ్మెల్యేలు చూపిస్తున్న జోరు..  అభివృద్ధి చేయడంలో మాత్రం చూపించలేకపోతున్నారు అనే విమర్శలు ప్రస్తుతం ఎక్కువైపోతున్నాయి. మొదట్లో ప్రజలు జగన్ సర్కార్ పై కాస్త సానుభూతి ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో తిరుపతిలో ఉప ఎన్నిక జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక జగన్ సర్కార్ మూడు సంవత్సరాల పాలనకు తిరుపతి ఉప ఎన్నిక నిలువుటద్దంగా మారబోతున్నది.


 ఇప్పటికే జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత  తో ఉన్న ప్రజలు..  తిరుపతి ఉప ఎన్నికలు తమ నిర్ణయాన్ని చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇక తిరుపతి ఉప ఎన్నికలలో  తామే గెలుస్తామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు అనే విషయం తెలిసిందే.  అయితే తిరుపతి ఉప ఎన్నికలో  వైసీపీ కి భారీ షాక్ తప్పదని విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నప్పటికీ తమదే విజయం అని వైసీపీ నేతలు మాత్రం గట్టిగా చెబుతున్నారు.  అయితే ఇలా గట్టిగా చెప్పడం వెనుక ఉన్నది ఓడిపోతామనే భయమా..  లేక నిజంగానే గెలుస్తామనే ధీమా నా  అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీ నేతల్లో ఉన్నప్పటికీ.. ఆ భయం ఇతరులకు కనిపించకుండా ధీమాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: