కొత్త కారు కొనాలనుకునే వారికి.. భారీ షాక్ ఇచ్చిన మారుతి సుజుకి..?

praveen
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయినా మారుతి సుజుకి ప్రస్తుతం తమ కస్టమర్లకు తక్కువ రేంజ్ నుంచి భారీ రేంజ్ వరకు కూడా కార్లను అందిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కువ మంది సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా కార్లు కొనుగోలు చేయాలని భావిస్తే మారుతి సుజుకి కార్లు ఎక్కువగా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే ప్రస్తుతం ఇలా మారుతి సుజుకి సంబంధించిన కార్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్న వారికి ప్రస్తుతం కంపెనీ తీసుకున్న నిర్ణయం చేదు వార్త అని చెప్పాలి. తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది మారుతి సుజుకి.

 కార్ల ధరలను ఏకంగా 34 వేల పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మారుతి సుజుకి తీసుకున్న ధరల పెంపు నిర్ణయం జనవరి 18 నుంచి అమలులోకి వచ్చింది. అయితే కొన్ని ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే ధరలు పెంచారు అంటూ స్పష్టం చేసింది మారుతి సుజుకి.. ప్రస్తుతం మార్కెట్లో ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగిపోవడం కారణంగానే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చింది. ఇక మోడల్ ప్రతిపాదికన మారుతి సుజుకి తీసుకున్న నిర్ణయంతో కార్ల ధర 34 వేల వరకు పెరిగింది.  వివిధ మోడళ్ల కు కార్ల ధరలు పెంచుతామని గత నెలలోనే మారుతి సుజుకి ప్రకటించిన విషయం తెలిసిందే.

 ఉత్పత్తి వ్యయం పెరగడంతో అటు మారుతి సుజుకి కంపెనీ పై.. ఎక్కువగా భారం పడటం తో ఇక ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేసేందుకు నిర్ణయించింది కంపెనీ.  ఇకపోతే గత ఏడాది కరోనా  వైరస్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా మారుతి సుజుకి కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి అన్న విషయం తెలిసిందే . ముఖ్యంగా డిసెంబర్ నెలలో అయితే 20 శాతం మేర అమ్మకాలు పైకి కదలడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రస్తుతం మారుతి సుజుకి తీసుకున్న నిర్ణయంతో భారీగా ధరలు పెరగడం కస్టమర్ల పై ప్రతికూల ప్రభావాన్ని చూపే  ప్రభావం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: