ప్రేమిస్తావా.. చావమంటావా.. చివరికి బెదిరించి అత్యాచారం..?

praveen
ఈ మధ్య కాలంలో ఎంతో మంది మోసగాళ్లు ప్రేమ అనే పేరుతో ఎన్నో నాటకాలు ఆడుతూ చివరికి ఆడ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్న  ఘటనలు తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అభం శుభం తెలియని ఆడ పిల్లలకు మాయ మాటలు చెప్పి లొంగ దీసుకుని... చివరికి అవసరాలు తీర్చుకుని రోడ్డుమీద వదిలేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి.  అంతేకాదు ఇక తమను ప్రేమించాలి అని ఆడ పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తున్న ప్రేమోన్మాదులు కూడా పెరిగి పోతున్నారు అనే విషయం తెలిసిందే.  ఇటీవల సూర్యాపేటలో శుక్రవారం వెలుగు లోకి వచ్చిన అక్క చెల్లెల పై అత్యాచారం ఘటన సంచలనం గా మారి పోయింది.

 అయితే ఈ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణలో భాగంగా ఊహించని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.  సూర్యాపేటలో ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.  అయితే పదిహేడేళ్ల పెద్ద కూతురికి మునగాల మండలానికి చెందిన చింతకాయల ఉదయ్ అనే యువకుడు మూడేళ్ల క్రితం ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. సూర్యాపేట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్నాడు ఉదయ్.

 అయితే ఇక సదరు బాలికతో మాయమాటలు నమ్మించి ముగ్గులోకి దింపాలి.  ఇక ఆ తర్వాత సమయం చూసి అక్కాచెల్లెళ్ల పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మరికొంత మంది అమ్మాయిలను మోసం చేసినట్లు..  నిందితుడు చరవాణి పరిశీలించిన తర్వాత పోలీసులు నిర్ధారించారు.  సూర్యాపేటకు చెందిన బాలికను  పెళ్లి చేసుకుంటానని ప్రేమించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మాయమాటలు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.  ఇక బాలికపై శారీరక అవసరాలు తీర్చడమే కాదు విడతలవారీగా రెండు లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.   మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: