తక్కువ ధరకే బంగారం.. అలా అని ఆశపడ్డారా.. అంతా కేల్ ఖతం..?

praveen
ఈ మధ్యకాలంలో కేటుగాళ్ల బెడద రోజురోజుకు ఎక్కువైపోతున్నది  అన్న  విషయం తెలిసిందే. ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ఎంతో మంది కేటుగాళ్ళు మాయ మాటలతో నమ్మించి చివరకి జనాల్ని బురిడీ కొట్టించి భారీగా డబ్బు సంపాదించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటే వచ్చే డబ్బులు కంటే జనాల్ని బురిడీ కొట్టిస్తే  వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేటి రోజుల్లో కేటుగాళ్లు. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో. ఇక్కడ కేటుగాళ్లు రెచ్చిపోయారు. మాయమాటలతో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 11 లక్షలు దోచుకున్నారు ఇద్దరు మోసగాళ్లు.

 ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే..  నల్గొండ జిల్లా శాంతి నగర్ కు చెందిన సైదా అనే వ్యక్తికి కొంతకాలం క్రితం సందీప్ కుమార్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు.  అయితే సైదా దగ్గర ఎక్కువ డబ్బు ఉన్న విషయాన్ని ఇద్దరు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలని అనుకున్నారు. దీనికోసం పక్కా ప్లాన్ వేశారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని.. ఒక కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామంటూ సైదా ను నమ్మబలికారు ఇద్దరు మాయగాళ్లు.

 ఈ క్రమంలోనే మాయ మాటలతో నమ్మించి పలు విడతలుగా సైదా నుంచి 11 లక్షల వరకు వసూలు చేశారు.  ఇక ఆ తర్వాత బంగారం కాంట్రాక్టుల గురించి ఈ కేటుగాళ్ల కు తరచు సైదా ఫోన్ చేయడంతో తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. వెంటనే నల్గొండ పోలీసుల దగ్గరకు చేరుకుని జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఇటీవల అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.  గతంలో కూడా ఈ  కేటుగాళ్లు ఇలా పలువురిని మోసం చేసినట్లు రికార్డుల్లో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: