చైనా మొబైల్స్ కి కష్టకాలం.. డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ డమాల్..?

praveen
ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చైనా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇలా ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు సరైన మార్గంలో కాకుండా దొడ్డిదారిలో వెళుతూ ఎప్పుడు ప్రపంచ దేశాలకు చిరాకు తెప్పిస్తూ ఉంటుంది చైనా. అయితే చైనా విస్తరణ వాద  ధోరణితో వ్యవహరిస్తుందని.. దొడ్డిదారిలో వెళ్తుంది అని తెలిసినప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం చైనా తీరుపై  ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ భారత్ చైనా సరిహద్దుల్లో చైనా ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం.. అటు వెంటనే భారత్ దూకుడుగా వ్యవహరించి చైనాకు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్న నేపథ్యంలో..  ప్రపంచ దేశాలు కూడా చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం చైనా ఆటలు ఎక్కడ సాగడం లేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత్ చైనా ను పూర్తిగా దేశం నుంచి నిషేధిస్తుంది. మొన్నటికి మొన్న చైనా రాఖీలను పూర్తిగా నిషేధించిన భారత్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత దీపావళి  సందర్భంగా చైనా టపాసులు కూడా నిషేధించి దేశీయ టపాసులు ఉత్పత్తి చేసి విజయం సాధించింది. ఇప్పటికే యాప్స్  నిషేధించడం ద్వారా చైనా వందల కోట్ల నష్టాన్ని చవిచూసేలా  చేసింది భారత్. ఇలా  క్రమక్రమంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతుంది భారత్.

 అదే సమయంలో చైనా కు సంబంధించిన స్మార్ట్ఫోన్ ల  వినియోగాన్ని కూడా తగ్గించే విధంగా మేకిన్ ఇండియా లో భాగంగా ముందడుగు వేస్తుంది అనే విషయం తెలిసిందే . ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఫోన్లకు కష్టకాలం వచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు. మొబైల్స్  అమ్మకం లో చైనా కు సంబంధించిన వ్యాపారులే  చైనా మొబైల్స్  అమ్మకపోవడంతో చైనా మొబైల్ సేల్స్ 20% పడిపోగా ప్రపంచవ్యాప్తంగా పంది శాతం మార్కెట్ ని కోల్పోయాయి  చైనా మొబైల్స్. ఇలా క్రమక్రమంగా జరుగుతున్న పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థ ను కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతున్నాయి  అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: