కొత్త దేశం పై పడిన కరోనా కన్ను.. అక్కడ తొలి పాజిటివ్ కేసు..?

praveen
కరోనా  మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే.  చైనాలో ఊహన్  నగరం లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ పాకిపోయింది. శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే అటు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఈ  వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే అటు ప్రజలందరిలో కరోనా వైరస్ పై అవగాహన రావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బారినపడకుండా ఉంటున్నారు. దీంతో ఆయా దేశాలలో వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. ఇలాంటి తరుణంలో కొత్త స్ట్రెయిన్ వైరస్ వెలుగులోకి వచ్చి అన్ని దేశాలను వణికిస్తోంది. అయితే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడించిన ప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటివరకు కరోనా చొరబడలేదు అన్నది నమ్మలేని నిజం అన్న విషయం తెలిసిందే.  ఇలా ఇప్పటివరకు కరోనా వైరస్ పంజా బారిన పడకుండా ఉన్న దేశాలలో మైక్రోనేషియా ఒకటి.

 అక్కడ ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ మహమ్మారి కరోనా వైరస్ చూపు ఈ దేశం పై పడినట్లు ఉంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడని దేశంగా కొనసాగిన మైక్రోనేషియా ఇక ఇప్పుడు ఆ గుర్తింపు కోల్పోయింది. ఫిలిప్పైన్స్ లో  ప్రభుత్వ నౌకలో మరమ్మత్తు లో ఉన్న సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు సూచించాడు. కరోనా వైరస్ బారిన పడిన వారిని సరిహద్దులలో  ఉంచారు.  వ్యాపారాలు చర్చి లు  యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: